Allu Arjun : బిగ్ అనౌన్స్మెంట్ ఉందంటున్న ఆహా.. అల్లు అర్జున్తో ఆహా కొత్త షో ప్లాన్ చేస్తుందా?
తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా వరుస సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంది. ఇటీవల బాలయ్యని తెలుగు ఇండియన్ ఐడల్ కి హోస్ట్ గా తీసుకొచ్చిన ఆహా, ఇప్పుడు అల్లు అర్జున్తో..

allu arjun aha
Allu Arjun : తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా వరుస సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంది. అన్స్టాపబుల్ టాక్ షోని అన్స్టాపబుల్ గా ముందుకు తీసుకు వెళ్తున్న బాలయ్యని.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి కూడా హోస్ట్ ని చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే ఈ షో మొత్తానికి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించడం లేదు. కేవలం షోకి సెలెక్ట్ అయ్యిన కంటెస్టెంట్స్ పరిచయం చేసే రెండు ఎపిసోడ్స్ కి మాత్రమే బాలయ్య హోస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే, ఆహా మరో సర్ప్రైజ్ ఇచ్చింది.
Pushpa 2: మళ్లీ డిసెంబర్ నెలపై కన్నేసిన పుష్పరాజ్
”ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మీరు మాస్ గా చూసి ఉంటారు, క్లాస్ గా చూసి ఉంటారు. ఈసారి ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో అల్లు అర్జున్ ని మీ ముందుకి తీసుకోని రాబోతున్నాము. బిగ్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి” అంటూ ట్వీట్ చేసింది. అలాగే అల్లు అర్జున్ న్యూ లుక్ లో ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ.. ఎవరన్నా ఏంటనేది చెప్పగలరా? అని ప్రశ్నించింది. దీంతో కొంతమంది నెటిజెన్లు కొత్త టాక్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇటీవల త్రివిక్రమ్, శ్రీలీల తో ఉన్న అల్లు అర్జున్ పిక్ చూపిస్తూ.. ఆ ఫొటోలోని బన్నీ డ్రెస్ అండ్ గెటప్, ఇప్పుడు రిలీజ్ చేసిన ఫొటోలోని డ్రెస్ అండ్ గెటప్ సేమ్ ఉంది.
Allu Arjun: తెలుగు పాట ఆస్కార్స్ను షేక్ చేయడం గర్వకారణం – అల్లు అర్జున్
ఈ అనౌన్స్మెంట్ ఆహాకి సంబంధించిన కొత్త యాడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటనేది తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే. ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశాడు. అర్జున్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు.
ICON STAR Allu Arjun ni meeru mass ga, class ga choosi untaru, eesari oka blockbuster look tho aha mee mundu ki teskoni raabothundi… Get ready for ‘The Biggest’ Announcement!
Any guesses??@alluarjun #AlluArjun? pic.twitter.com/iwjn7Xf3bE— ahavideoin (@ahavideoIN) March 15, 2023