Allu Arjun : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లైవ్ కాన్సర్ట్ లో నెదర్లాండ్ సింగర్‌తో కలిసి స్టెప్పులేసిన బన్నీ..

ఇటీవలే పుష్ప 2 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాడు అల్లు అర్జున్. తాజాగా బన్నీ ఓ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నాడు. నెదర్లాండ్స్ కి చెందిన డీజే, సింగర్ మార్టిన్ గ్యారిక్స్ హైదరాబాద్ లో సన్‌బర్న్ అనే పేరుతో శనివారం రాత్రి ఓ లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ ని నిర్వహించాడు. ఈ లైవ్ కాన్సర్ట్ కి..............

Allu Arjun : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లైవ్ కాన్సర్ట్ లో నెదర్లాండ్ సింగర్‌తో కలిసి స్టెప్పులేసిన బన్నీ..

Allu Arjun dance with Martin Garrix for pushpa song in a live concert at Hyderabad

Allu Arjun :  పుష్ప సినిమాతో బన్నీకి వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పుష్ప సినిమా సాంగ్స్, డైలాగ్స్ దేశమంతటా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాతో బన్నీకి నార్త్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇండియా అంతటా పుష్ప 2 సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊ ఊ అంటావా పాట అయితే విదేశాల్లో కూడా బాగా పాపులర్ అయింది.

ఇటీవలే పుష్ప 2 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాడు అల్లు అర్జున్. తాజాగా బన్నీ ఓ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నాడు. నెదర్లాండ్స్ కి చెందిన డీజే, సింగర్ మార్టిన్ గ్యారిక్స్ హైదరాబాద్ లో సన్‌బర్న్ అనే పేరుతో శనివారం రాత్రి ఓ లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ ని నిర్వహించాడు. ఈ లైవ్ కాన్సర్ట్ కి చాలా మంది ఆడియన్స్ వచ్చారు. అయితే ఈ లైవ్ కాన్సర్ట్ కి అల్లు అర్జున్ కూడా వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

RC-NTR : లాస్ ఏంజిల్స్ లో తారక్ గురించి చరణ్ ఏం చెప్పాడో తెలుసా??

అల్లు అర్జున్ లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ కి రావడమే కాకుండా పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊ ఊ అంటావా పాటకు మార్టిన్ గ్యారిక్స్ తో కలిసి స్టెప్పులు వేశాడు. అంతే కాక స్టేజి మీద ఉన్న బెంచ్ ఎక్కి ఇద్దరూ కలిసి స్టెప్పులు వేస్తూ ఆడియన్స్ కి అభివాదం చేశారు. దీంతో బన్నీ లైవ్ కాన్సర్ట్ లో సందడి చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు బన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మార్టిన్ గ్యారిక్స్ తో మంచి ఫన్ నైట్. తగ్గేదెలా అంటూ పోస్ట్ చేశాడు.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)