RC-NTR : లాస్ ఏంజిల్స్ లో తారక్ గురించి చరణ్ ఏం చెప్పాడో తెలుసా??

తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆడియన్స్ చరణ్ ని తారక్ గురించి అడిగారు. చరణ్ తారక్ గురించి మాట్లాడుతూ.....................

RC-NTR : లాస్ ఏంజిల్స్ లో తారక్ గురించి చరణ్ ఏం చెప్పాడో తెలుసా??

Ram Charan Comments on NTR at Los angeles

RC-NTR :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు, కలెక్షన్స్, అంతర్జాతీయ అవార్డులు అందుకుంటుంది. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. త్వరలోనే ఆస్కార్ వేడుకలు ఉండటంతో పాటు, అమెరికాలో RRR సినిమాని రీ రిలీజ్ చేయడంతో RRR చిత్ర యూనిట్ అంతా అమెరికాకి వెళ్లి సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు.

 

RRR సినిమా వల్ల చరణ్, ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, అనుబంధం గురించి అందరికి తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వీళ్ళిద్దర్నీ చూసి వీరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. ఇక ప్రమోషన్స్, సినిమా రిలీజ్ తర్వాత ఇద్దరూ కలిసి కనపడిన ప్రతిసారి అభిమానులు సంతోషించారు. వీళ్ళని చూసి ఇప్పటి హీరోలంతా ఇలాగే ఉండాలని అనుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో RRR రీ రిలీజ్ అయిన పలు థియేటర్స్ కి రాజమౌళి, చరణ్ వెళ్లి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడుతున్నారు. నందమూరి కుటుంబంలో తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ వెళ్లలేకపోయారు. త్వరలోనే ఎన్టీఆర్ కూడా అమెరికాకు వెళ్లి RRR యూనిట్ తో కలిసి సందడి చేయనున్నారు.

Ram Charan : కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇద్దాం అనుకున్నా.. చరణ్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆడియన్స్ చరణ్ ని తారక్ గురించి అడిగారు. చరణ్ తారక్ గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం ఎప్పట్నుంచో స్నేహితులం. రెగ్యులర్ గా మాట్లాడుకునేవాళ్ళం. కానీ మా సినిమాల బిజీ వల్ల ఎక్కువగా కలిసేవాళ్ళం కాదు. RRR సినిమా మమ్మల్ని మరింత చేరువ చేసింది. ఇద్దరం కలిసి RRR సినిమా ప్రయాణం చేశాం. ఈ సినిమాలో మా ఇద్దర్ని హీరోలుగా పెట్టాలనుకున్న రాజమౌళికి ధన్యవాదాలు. తారక్ ఉండటంతో సినిమాలో నటించడం నాకు ఇంకా సులువైంది. ప్రస్తుతం నేను తారక్ ని ఎంతో మిస్ అవుతున్నాను. తనకు వేరే పనులు ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు. తారక్ నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నా అని తెలిపాడు. దీంతో చరణ్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.