Ram Charan : కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇద్దాం అనుకున్నా.. చరణ్ సంచలన వ్యాఖ్యలు..

. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చరణ్ మాట్లాడుతూ................

Ram Charan : కొన్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇద్దాం అనుకున్నా.. చరణ్ సంచలన వ్యాఖ్యలు..

Ram Charan wants to give break to movies before RRR

Ram Charan :  RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రోజులు పేరు, ప్రఖ్యాతలు, కలెక్షన్స్ సాధించిన RRR సినిమా ఇటీవల అవార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై వరుసగా పలు అవార్డుని సాధిస్తుంది RRR సినిమా. ఇక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. త్వరలోనే ఆస్కార్ వేడుకలు ఉండటంతో పాటు, అమెరికాలో RRR సినిమాని రీ రిలీజ్ చేయడంతో RRR చిత్ర యూనిట్ అంతా అమెరికాకి వెళ్లి సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు.

అమెరికాలో RRR రీ రిలీజ్ అయిన పలు థియేటర్స్ కి రాజమౌళి, చరణ్ వెళ్లి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడుతున్నారు. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చరణ్ మాట్లాడుతూ.. RRR సినిమాకు ముందు నేను కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. సినిమాల నుంచి గ్యాప్ తీసుకొని కొత్తగా ఏదైనా నేర్చుకొని మళ్ళీ సినిమాల్లోకి వద్దాం అనుకున్నాను. కానీ అప్పుడే రాజమౌళి నుంచి RRR సినిమా ఆఫర్ వచ్చింది. రాజమౌళితో గతంలో నేను మగధీర సినిమా చేశాను. ఆ సినిమాకి నేను ఒక స్టూడెంట్ ని. RRR సినిమాకు కూడా స్టూడెంట్ నే. రాజమౌళి నాకు ప్రిన్సిపాల్ లాంటి వారు. ఆయన్ని కలిసిన ప్రతిసారి సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుంటాను. RRR ఆఫర్ రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి బయటకు వెళ్లి నేర్చుకోవడంకంటే రాజమౌళి దగ్గర పనిచేస్తే కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు కదా అని ఈ సినిమా ఓకే చెప్పాను. RRR ప్రయాణంలో నేను ఎంతో నేర్చుకున్నాను. రాజమౌళి కాలేజీలో నేను ఒక స్టూడెంట్ అయినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని అన్నాడు.

Balagam : బలగం మూవీ కథ నాదే అంటూ మీడియా ముందుకొచ్చిన జర్నలిస్ట్.. డైరెక్టర్ వేణు ఏమంటాడో??

దీంతో RRR ముందు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకున్నాను అని చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చరణ్ ఫ్యాన్స్ దీనిపై స్పందిస్తూ RRR సినిమా వచ్చి చరణ్ కి మంచి చేసింది. ఈ సినిమా ఆఫర్ రాకపోతే చరణ్ ని కొన్నాళ్లపాటు మిస్ అయ్యేవాళ్ళం అని కామెంట్స్ చేస్తున్నారు.