Balagam : బలగం మూవీ కథ నాదే అంటూ మీడియా ముందుకొచ్చిన జర్నలిస్ట్.. డైరెక్టర్ వేణు ఏమంటాడో??

తాజాగా బలగం సినిమా కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకి వచ్చాడు. శనివారం సాయంత్రం గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి.....................

Balagam : బలగం మూవీ కథ నాదే అంటూ మీడియా ముందుకొచ్చిన జర్నలిస్ట్.. డైరెక్టర్ వేణు ఏమంటాడో??

Journalist Satish copy Allegations On dil raju and director venu balagam movie story

Balagam :  ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు మొదటిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి ఈ సినిమాని నియమించింది. ఈ సినిమాకి ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా చేశారు. బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంత్రి KTR కూడా విచ్చేసి చిత్రయూనిట్ ని అభినందించారు. బలగం సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ అయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుంది అని అంటున్నారు

తాజాగా బలగం సినిమా కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకి వచ్చాడు. శనివారం సాయంత్రం గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి… బలగం సినిమా కథ నాదే. ఈ కథని నేను 2011లోనే రాసుకున్నాను. ఈ కథ 2014లో పచ్చికి పేరుతో నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రింట్ అయింది. తెలంగాణ ఉద్యమం రోజుల్లో మా తాత చనిపోతే పిట్టకి ముట్టలేదు. అప్పుడు అదే కథలా రాసుకున్నా. ఈ కథని చూసే నాకు నమస్తే తెలంగాణలో ఉద్యోగం ఇచ్చారు. ఈ కథ 100% నాదే. ఇందులో మూడు పాటలు, నాలుగు జోక్స్ యాడ్ చేసి వాళ్ళ పేర్లు వేసుకున్నారు. దీనిపై నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఈ రోజు దిల్ రాజు ఆఫీస్ కి పిలిపించుకొని గంటసేపు మాట్లాడాడు. ఈ కథ వేణుకి ఎవరో చెప్పారు అంట అని నాతో దిల్ రాజు చెప్పాడు. నా కథకు, నాకు న్యాయం జరగాలి. ఈ సినిమాలో ఈ కథ నాదే అని పేరు వేయాలి. మా న్యాయవాదిని కలిసి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. అవకాశం వస్తే కేటీఆర్ ని కలుస్తాను. నాకు కథ రాసుకోవడమే తెలుసు కాపీ కొట్టడం తెలీదు. నేనేమి డబ్బుకోసం ఇదంతా చేయట్లేదు అని వ్యాఖ్యలు చేశారు.

Sir Movie : సార్ సినిమాని స్కూల్ పిల్లలకు ఫ్రీగా చూపిస్తాం.. స్పెషల్ ఆఫర్ ఇచ్చిన సార్ చిత్రయూనిట్..

అయితే దీనిపై దిల్ రాజు అధికారికంగా స్పందించలేదు. డైరెక్టర్ వేణు నేడు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడనున్నాడు. సతీష్ చేసిన ఆరోపణలపై వేణు ఎలా స్పందిస్తాడో చూడాలి.