Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?? అందరికి చెప్పేసిన స్నేహరెడ్డి..

తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ని ప్రశ్నలు అడగమని, వారు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్..............

Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?? అందరికి చెప్పేసిన స్నేహరెడ్డి..

Allu Arjun

Allu Arjun :  పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం దేశం మొత్తం అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో తన తర్వాతి సినిమాలని మరింత పకడ్బందీగా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో ‘పుష్ప 2’ని మరింత భారీగా ప్లాన్ చేయనున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ కి తగ్గట్టు సుకుమార్ స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజెస్ కూడా చేస్తున్నట్టు సమాచారం.

Beast Closing Collections : తెలుగులో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్.. దిల్ రాజుకి భారీ నష్టాలు..

ఇక బన్నీ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫోటోలు, పిల్లల ఫోటోలు, ఫ్యామిలీ, ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నిటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది స్నేహ. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ని ప్రశ్నలు అడగమని, వారు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ అభిమానులు పలు ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని అల్లు అర్జున్‌కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగగా.. బిర్యానీ అంటే బన్నీకి చాలా ఇష్టం అని తెలిపింది. దీంతో తమ అభిమాన హీరో ఫేవరేట్ ఫుడ్ బిర్యానీ అని తెలుసుకొని, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు.