Beast Closing Collections : తెలుగులో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్.. దిల్ రాజుకి భారీ నష్టాలు..

విజయ్ గత సినిమా మాస్టర్ తెలుగులో 6 కోట్లకు అమ్ముడవ్వగా బీస్ట్ సినిమాని దిల్ రాజు 11 కోట్లకి కొన్నారు. ప్రస్తుతం ఇంకో నాలుగు రోజుల్లో ఆచార్య థియేటర్స్ లోకి...........

Beast Closing Collections : తెలుగులో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్..  దిల్ రాజుకి భారీ నష్టాలు..

Beast

Beast Closing Collections :  తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. విజయ్, ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్, హీరోయిన్ పూజా హెగ్డే వరుస విజయాలలో ఉండటంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అంతే కాక ఈ సినిమా నుంచి వచ్చిన అరబిక్ కుతూ సాంగ్ దేశమంతటా ఊపేయడంతో బీస్ట్ పై అంచనాలు పెరిగాయి. ఇటీవల అందరూ పాన్ ఇండియా అంటుండటంతో ఈ సినిమాని కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. కానీ ఆ తర్వాత రోజే ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘కేజిఎఫ్ 2’ విడుదల అవ్వడంతో ‘బీస్ట్’కి మరింత నష్టం వచ్చింది. ‘కేజిఎఫ్ 2’ సినిమా మొదటి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకొని పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో కలెక్షన్లని కొల్లగొట్టింది. చాలా ఏరియాలలో ‘కేజిఎఫ్ 2’ సినిమాకి ఉన్న రెస్పాన్స్ చూసి బీస్ట్ ని పక్కన పెట్టేశారు. విజయ్ సొంత రాష్ట్రం తమిళనాడులో కూడా ‘కేజిఎఫ్ 2’ కోసం బీస్ట్ ని థియేటర్స్ లో నుంచి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో బీస్ట్ సినిమా భారీ నష్టాలని మూటకట్టుకుంది.

Pawan Kalyan : కొణిదెల బ్యానర్‌లో చరణ్ నిర్మాతగా పవన్ సినిమా.. ఎప్పటికయ్యేనో??

ఇక బీస్ట్ సినిమాని తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో బీస్ట్ సినిమాతో విజయ్ ని మరింత ప్రమోట్ చేస్తే తన సినిమాకి పనికొస్తుందని దిల్ రాజు గతంలో విజయ్ సినిమాల కంటే ఎక్కువ రేటు పెట్టి తెలుగు రైట్స్ కొన్నారు. విజయ్ గత సినిమా మాస్టర్ తెలుగులో 6 కోట్లకు అమ్ముడవ్వగా బీస్ట్ సినిమాని దిల్ రాజు 11 కోట్లకి కొన్నారు. ప్రస్తుతం ఇంకో నాలుగు రోజుల్లో ఆచార్య థియేటర్స్ లోకి వస్తుండటం, ఇంకా కేజిఎఫ్ థియేటర్లలో నడుస్తుండటంతో బీస్ట్ తెలుగులో థియేట్రికల్ రన్ క్లోజ్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ సినిమాని 11 కోట్లకి కొనగా క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాంలో 2.45 కోట్లు

సీడెడ్‌లో 1.10 కోట్లు

ఉత్తరాంధ్రలో 0.90 కోట్లు

ఈస్ట్ లో 0.63 కోట్లు

వెస్ట్ లో 0.62 కోట్లు

గుంటూరులో 0.80 కోట్లు

కృష్ణాలో 0.52 కోట్లు

నెల్లూరులో 0.40 కోట్లు వసూలు చేసింది.

Hridayanath Mangeshkar : ఆసుపత్రిలో లతా మంగేష్కర్ సోదరుడు..

మొత్తంగా ఏపీ, తెలంగాణలో బీస్ట్‌ సినిమాకి 7.42 కోట్ల షేర్ వసూలు అయింది. ‘బీస్ట్’ సినిమా తెలుగులో దాదాపు 11 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనీసం 12 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కానీ బీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టడంతో దాదాపు 4 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది.