Allu Arjun : ఐకాన్ స్టార్ ఒక్క ఫొటోతో.. ‘పుష్ప’పై ఎన్నో అనుమానాలు..

పుష్ప 2 ఇప్పుడప్పుడే లేదా..? షూటింగ్ ఇంకా డిలే కాబోతోందా..? ఒకవేళ మొదలైనా పుష్పలో అల్లు అర్జున్ లుక్ మారిపోతుందా..? రఫ్ లుక్ నుంచి స్టైలిష్ డాన్ గా ఛేంజ్ అవుతున్నాడా..? ఇలా రకరకాల డౌట్స్ స్టార్ట్ అయ్యాయి టాలీవుడ్ లో. ఇన్నాళ్లూ లేని డౌట్లు...........

Allu Arjun : ఐకాన్ స్టార్ ఒక్క ఫొటోతో.. ‘పుష్ప’పై ఎన్నో అనుమానాలు..

Allu Arjun

Allu Arjun :  పుష్ప 2 ఇప్పుడప్పుడే లేదా..? షూటింగ్ ఇంకా డిలే కాబోతోందా..? ఒకవేళ మొదలైనా పుష్పలో అల్లు అర్జున్ లుక్ మారిపోతుందా..? రఫ్ లుక్ నుంచి స్టైలిష్ డాన్ గా ఛేంజ్ అవుతున్నాడా..? ఇలా రకరకాల డౌట్స్ స్టార్ట్ అయ్యాయి టాలీవుడ్ లో. ఇన్నాళ్లూ లేని డౌట్లు, ఫాన్స్ కి రాని డౌట్లు ఇప్పుడే ఎందుకొచ్చాయంటే దానికి ఒకే ఒక్క ఫోటో కారణం.

పుష్ప సినిమా తర్వాత పెద్దగా జనాల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ యాక్టివిటీ చూపించని బన్నీ తాజాగా ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో బన్నీ పోస్ట్ చేసిన ఫోటో చూసిన జనాలకి బోలెడు డౌట్లు వచ్చేశాయి. అసలు బన్నీ ఏం చేస్తున్నట్టు..? సడెన్ గా మాస్ లుక్ నుంచి క్లాస్ లుక్ కి మారిపోయాడేంటి..? అసలు ఈ ఫోటో వెనక స్టోరీ ఏంటి అని తెగ ఆలోచిస్తున్నారు. మొన్నటి వరకు కూడా లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, పుష్ప సినిమా మాస్ లుక్ లో ఉన్న బన్నీ, లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫోటోలో ట్రిమ్ చేసిన గడ్డం, జుట్టుతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

Balakrishna : అభిమాని కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టిన బాలయ్య.. వైరల్ గా మారిన వీడియో

ఈ ఫోటోతో బన్నీ పుష్ప 2 లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. పుష్పలో మాస్ క్యారెక్టర్ చేసిన బన్నీ, పుష్ప 2లో స్టైలిష్ డాన్ గా మారిపోతున్నాడని, అందుకే ఈ మేకోవర్ అని అంటున్నారు. అసలు పుష్ప లుక్ రివీల్ చెయ్యడానికి పుష్ప 2 షూటింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యేలా లేదు. అదిగో, ఇదిగో అంటూ 6 నెలలనుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న పుష్ప 2 షూటింగ్ ఆగస్ట్ లో మొదలు పెడతారని అంటున్నారు. అప్పటికి కూడా క్లారిటీ లేదు.

ఇన్ని రోజులు లుక్ దగ్గరనుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ ఎక్కడా చేంజ్ లేకుండా అదే పుష్ప క్యారెక్టర్ మైంటైన్ చేస్తూ వచ్చాడు. సడెన్ గా మరోసారి స్టైలిష్ స్టార్ అన్నట్టు చాలా స్టైలిష్ గా ఈ ఫోటో పెట్టడంతో పుష్ప పై అభిమానులు ఇలా లెక్కకలేనన్నని డౌట్స్ అడుగుతున్నారు అభిమానులు. అయితే ఇది ఒక యాడ్ కోసం మారాడని, మళ్ళీ పుష్ప లుక్ లోకి వస్తాడని అంటున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.