Balakrishna : అభిమాని కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టిన బాలయ్య.. వైరల్ గా మారిన వీడియో

తాజాగా బాలకృష్ణ చేసిన పనికి అందరూ ఆనందంగా ఫీల్ అవుతున్నారు. బాల‌య్య గ‌తంలో ఓ అభిమానికి క‌లుస్తాను అని మాటిచ్చారట. ఆ మాటని గుర్తు పెట్టుకొని ప్రస్తుతం కర్నూలు జిల్లాలో షూటింగ్ కి వెళ్లడంతో అక్కడే ఉండే........

Balakrishna : అభిమాని కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టిన బాలయ్య.. వైరల్ గా మారిన వీడియో
ad

Balakrishna :  గత కొన్ని నెలల నుంచి బాలకృష్ణ అఖండ, అన్ స్టాపబుల్ షోలు సూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఇక బాలయ్య బాబు ఏం చేసినా వార్తే. అప్పుడప్పుడు ఎంత సీరియస్ అయినా బాలయ్య బాబు ఎన్నో మంచి పనులతో ముందుంటారు. ఓ పక్కన క్యాన్సర్ హాస్పిటల్ తో ఎంతో మందికి ప్రాణాలు పోస్తూ మరో పక్క తన ఫ్యాన్స్ కి కూడా సహాయం చేస్తూ ఉంటారు.

Nikhil : బోనాల్లో సందడి చేసిన హీరో నిఖిల్

తాజాగా బాలకృష్ణ చేసిన పనికి అందరూ ఆనందంగా ఫీల్ అవుతున్నారు. బాల‌య్య గ‌తంలో ఓ అభిమానికి క‌లుస్తాను అని మాటిచ్చారట. ఆ మాటని గుర్తు పెట్టుకొని ప్రస్తుతం కర్నూలు జిల్లాలో షూటింగ్ కి వెళ్లడంతో అక్కడే ఉండే ఆ అభిమానికి ఫోన్ చేసి తన దగ్గరకు పిలిపించుకొని, ఆ అభిమాని, అతని ఫ్యామిలీతో కలిసి భోజనం చేశారు. వారితో చాలా సేపు ఆప్యాయంగా ముచ్చటించారు. దీంతో ఆ అభిమాని, అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇక మరో అభిమాని కొడుకుతో సరదాగా ఆడుకున్నారు. రెండు రోజుల క్రితం దాదాపు 100 మంది అభిమానులకి ఫొటోలు ఇచ్చారు. ఇలా షూట్ గ్యాప్ లో అభిమానులకు దగ్గరవుతున్నారు బాలయ్య, దీంతో అభిమానులు పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.