Allu Arjun : స్పెషల్ సాంగ్ చేసినందుకు సమంత కి థ్యాంక్స్ చెప్పాలి

అల్లు అర్జున సమంత గురించి మాట్లాడుతూ... సమంత గారికి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్‌ సాంగ్‌లో నటించేందుకు హీరోయిన్స్ కి కొన్ని పరిమితులు ఉంటాయి. సమంత స్టార్ హీరోయిన్.....

Allu Arjun : స్పెషల్ సాంగ్ చేసినందుకు సమంత కి థ్యాంక్స్ చెప్పాలి

Allu Arjun

Allu Arjun :  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో మూడో సినిమాగా వస్తుంది ‘పుష్ప’. రష్మిక ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్‌ ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Rajinikanth : గుండె మీద రజినీకాంత్ పచ్చబొట్టు వేసుకున్న హ‌ర్బ‌జ‌న్ సింగ్
ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. చైతూతో విడాకుల తర్వాత, అది కూడా ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేయడంతో అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. పాట కూడా బాగుండటంతో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ సాంగ్ లో సమంత రెచ్చిపోయి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్‌ సమంత గురించి మాట్లాడాడు.

Pawan Kalyan : 700 రూపాయలతో మ‌ద్యం కొని 5రూపాయ‌ల‌తో సినిమాకు వెళ్లండ‌ని చెబుతున్నారు : పవన్ కళ్యాణ్

అల్లు అర్జున సమంత గురించి మాట్లాడుతూ… సమంత గారికి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్‌ సాంగ్‌లో నటించేందుకు హీరోయిన్స్ కి కొన్ని పరిమితులు ఉంటాయి. సమంత స్టార్ హీరోయిన్ అయినా మా సినిమాలో చేయమని అడగ్గానే ఒప్పుకుంది. తను మమ్మల్ని నమ్మింది. మేము అవుట్ పుట్ ఎలా అడిగితే అలా చేసింది. సైలెంట్‌గా వచ్చి తన పని తానూ చేసుకొని వెళ్లిపోయింది. తన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది సమంత. ఈ సందర్భంగా సమంతకు సభాముఖంగా ధన్యవాదాలు చెబుతున్నాను’ అని బన్నీ అన్నాడు.