Rajinikanth : గుండె మీద రజినీకాంత్ పచ్చబొట్టు వేసుకున్న హ‌ర్బ‌జ‌న్ సింగ్

ఇండియ‌న్ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ త‌న‌ స్టైల్‌లో రజినీకాంత్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు చెప్పి వేరే అభిమానులని ఆశ్చర్యంలో ముంచాడు. హ‌ర్బ‌జ‌న్ గుండెపై ర‌జినీకాంత్ టాటూను......

Rajinikanth : గుండె మీద రజినీకాంత్ పచ్చబొట్టు వేసుకున్న హ‌ర్బ‌జ‌న్ సింగ్

harbajan

Rajinikanth :  సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ కు ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా అభిమానులు ఉంటారు. సెలబ్రిటీలు కూడా రజినీకి ఫ్యాన్సే. నిన్న రజిని బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో బర్త్ డే శుభాకాంక్షలు తెలియచేశారు. కొంతమంది అభిమానులు వినూత్న రీతిలో విషెష్ చెప్పారు. ఓ క్రికెటర్ ఏకంగా రజిని ఫోటోని గుండె మీద పచ్చ బొట్టు వేయించుకొని తన అభిమానాన్ని తెలియచేశాడు.

ఇండియ‌న్ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ త‌న‌ స్టైల్‌లో రజినీకాంత్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు చెప్పి వేరే అభిమానులని ఆశ్చర్యంలో ముంచాడు. హ‌ర్బ‌జ‌న్ గుండెపై ర‌జినీకాంత్ టాటూను వేయించుకుని ఫోటోలు దిగాడు. ఆ టాటూని చూపిస్తూ దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు హర్భజన్.

Bigg Boss Kajal : కాజల్ పై సీరియస్ అయిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు

ఆ ఫోటోని షేర్ చేస్తూ.. నా ఛాతిపై సూప‌ర్ స్టార్ ఉన్నాడు. 80ల‌లో మీరు ’బిల్లా’, 90ల‌లో ‘భాషా’, 2వ శతాబ్దంలో ‘పెద్ద‌న్న’, ఒకే ఒక్క సినిమా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హ‌ర్బ‌జ‌న్ సింగ్ చూపిన ఈ అంతులేని అభిమానానికి ర‌జినీకాంత్ ఫ్యాన్స్ ఆనందిస్తూ ఈ ఫోటోకి కామెంట్స్ చేస్తున్నారు.