sankranti 2022: ఇప్పటికే టఫ్‌ఫైట్.. అయినా బంగార్రాజు సై?

టాలీవుడ్ లో రిలీజ్ క్లాష్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ సినిమాలు అడ్డులేకుండా ఏ స్టార్ హీరోలు అడ్డురాకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. ఎవరో ఒకరొచ్చి షెడ్యూల్ మాత్రం డిస్టర్బ్..

sankranti 2022: ఇప్పటికే టఫ్‌ఫైట్.. అయినా బంగార్రాజు సై?

Sankranti 2022

sankranti 2022: టాలీవుడ్ లో రిలీజ్ క్లాష్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ సినిమాలు అడ్డులేకుండా ఏ స్టార్ హీరోలు అడ్డురాకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. ఎవరో ఒకరొచ్చి షెడ్యూల్ మాత్రం డిస్టర్బ్ చేసేస్తున్నారు. పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తుందేమో అనేలా ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా-నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రామ్-భీమ్ వచ్చేస్తారని ప్రకటన వచ్చిన దగ్గర నుండి మరి మిగతా సినిమాల సంగతేంటి అనే డైలమా కొనసాగుతుంది.

Jr NTR: ఎక్స్‌పెరిమెంట్స్ జోలికెళ్లని తారక్.. పక్కా సేఫ్ గేమ్!

అందరికంటే ముందుగా సంక్రాంతికి వారం రోజుల ముందే జనవరి 7న ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ థియేటర్లలో దిగిపోతుండగా 12న పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సందడిని పెంచడానికే ఫిక్స్ అయ్యాడు. గత ఏడాది సంక్రాంతికి సరిలేరునీకెవ్వరు సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన మహేష్ బాబు సర్కారు వారి పాటతో జనవరి 13న వస్తున్నాడు. ఇక మూడేళ్ళ నుండి ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ ఆ తర్వాత జనవరి 14న రాధేశ్యామ్ తో వస్తున్నాడు.

Sarkaru Vaari Paata: మహేష్ కాన్ఫిడెన్స్.. పోకిరి రేంజ్ వైబ్స్ ఇస్తుందా?

మన సినిమాలకే స్పేస్ లేక, ధియేటర్లు సరిపోక, ఎక్కడ అక్యుపై చెయ్యాలో తెలీక స్టార్లు, ప్రొడ్యూసర్లు సతమతమవుతుంటే.. ఈ టైట్ షెడ్యూల్ లో తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా సంక్రాంతి బరిలోకి యాడ్ అయ్యారు. అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా తెరకెక్కుతున్న రేసింగ్ యాక్షన్ డ్రామా వలిమై కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇప్పటికీ ఇందులో తగ్గేది ఎవరు ముందుగా వచ్చేది ఎవరని చర్చలు జరుగుతుంటే.. సీనియర్ హీరో నాగార్జున కూడా ఈ పండగకు బంగార్రాజుగా రావాలని ఫిక్స్ అయినట్లు వినిపిస్తుంది.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

గతంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ 2016 జనవరి 15వ తేదీనే విడుదలై సంచలన విజయానికి సరికొత్త అర్థం చెప్పింది. ఆ సెంటిమెంట్ కారణంగా వచ్చే ఏడాది అదే రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమా పెంచేసిన అంచనాలు బంగార్రాజు మీద బలంగానే ఉండగా.. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించడం.. ఇందులో నాగచైతన్య, కృతి శెట్టి కనిపించనుండడంతో ఈ సినిమా కోసం నాగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు జోరందుకోగా.. సంక్రాంతికే వస్తాడని గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ టఫ్ ఫైట్ నుండి తప్పుకొనేది ఎవరో.. బరిలో నిలిచేది ఎవరో!