Amazon Prime Day sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. త్వరపడండి!

కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది.

Amazon Prime Day sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. త్వరపడండి!

Oneplus, Samsung, Redmi, Amazon Prime Day Sale

Amazon Prime Day sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది. జూలై 23 అర్ధరాత్రి నుంచి (శనివారం) ప్రారంభమవుతుంది. ఈ సేల్ ఈవెంట్ రెండు రోజుల పాటు కొనసాగుతుంది. మొబైల్ ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ICICI బ్యాంక్, SBI బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో కస్టమర్‌లు ఎక్స్ఛేంజ్ కూపన్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. అంతేకాదు.. ఈ సేల్ సందర్భంగా కొన్ని డీల్స్ కూడా వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా టాప్ 10 ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

టాప్ 10 ఫోన్ డీల్‌ల లిస్టు మీకోసం :
– Samsung Galaxy S20 FE 5G ధర రూ. 33,990గా ఉంది. బ్యాంక్ + కూపన్ ఆఫర్‌లతో మాత్రమే తగ్గింపు వర్తిస్తుంది. ఈ డివైజ్ హుడ్ కింద పాత Qualcomm Snapdragon 865 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇటీవలే
Samsung ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం రూ. 34,990కి విక్రయిస్తోంది. ఈ సేల్ సందర్భంగా అమెజాన్ జాబితా ప్రకారం.. OnePlus 10R బ్యాంక్ కూపన్ ఆఫర్‌లతో రూ. 33,999లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం రూ.38,999కి
విక్రయిస్తోంది. ఈ డివైజ్ 80W ఫాస్ట్ ఛార్జ్, MediaTek Dimensity 8100 Max ప్రాసెసర్‌తో వస్తుంది.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 12 Pro, బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ. 51,999కి అందుబాటులో ఉంటుంది. 2K AMOLED డిస్‌ప్లే, 50 -MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, Qualcomm Snapdragon 8 Gen 1 SoC మరిన్నింటిని అందిస్తుంది. అమెజాన్ 3 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందించవచ్చు. అమెజాన్ ప్రైమ్‌డే సేల్ సమయంలో అందుబాటులో ఉండే బ్యాంక్ కార్డ్, కూపన్ ఆఫర్‌లతో iQOO Neo 6 రూ. 25,999 ధరతో పొందవచ్చు. హ్యాండ్‌సెట్ అసలు ధర రూ.29,999గా మార్కెట్లో ఉంది.

Oneplus, Samsung, Redmi, Amazon Prime Day Sale (1)

Oneplus, Samsung, Redmi, Amazon Prime Day Sale 

Redmi Note 11 4G ధర రూ. 12,999 నుంచి రూ.10,749కి తగ్గింది. స్నాప్‌డ్రాగన్ 680 SoC, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. Samsung Galaxy M13 బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ.9,999కి అందుబాటులో ఉంది. ఈ డివైజ్
అసలు ధర రూ.11,999గా ఉంది. 6,000mAh బ్యాటరీతో 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈవెంట్‌లో రూ. 9,999 ధరతో అందుబాటులో ఉంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారు Realme
Narzo 50 కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈవెంట్ సందర్భంగా OnePlus Nord CE 2 5G ధర రూ. 22,499కి అందుబాటులో ఉంటుంది.

ఈ డివైజ్ 65W ఫాస్ట్ ఛార్జర్, MediaTek డైమెన్సిటీ 900 SoC, 64-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. OnePlus Nord CE 2 Lite 5G ధర రూ. 19,999 నుంచి రూ.17,499 వద్ద అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 695 SoC ద్వారా ఆధారితమైనది. హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చింది. Redmi 10 Prime (2022) మోడల్ బ్యాంక్ ఆఫర్‌తో రూ. 9,749 అందుబాటులో ఉంది. ఈ డివైజ్ అసలు ధర రూ. 10,999గా ఉంది. 6,000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే, MediaTek Helio G88 SoC మరిన్నింటితో వచ్చింది.

Read Also :  Flipkart Big Saving Days Sale : ఆపిల్ ఐఫోన్ 11 ధర తగ్గిందోచ్.. బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్.. డోంట్ మిస్!