Amitab : పాన్ మసాలా బ్రాండ్‌కు లీగల్ నోటీసులు పంపిన అమితాబ్

కొన్ని నెలల క్రితం అమితాబ్ 'కమలా పసంద్‌' అనే బ్రాండ్ పాన్‌ మసాలకు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ చేశారు. ఈ యాడ్ అన్ని మీడియాలోనూ టెలిక్యాస్ట్ అయింది. అయితే ఇది కూడా ఒకరకమైన పొగాకు

Amitab : పాన్ మసాలా బ్రాండ్‌కు లీగల్ నోటీసులు పంపిన అమితాబ్

Amithab : సెలబ్రిటీలు యాడ్స్ చేసి వాటికి భారీగా డబ్బులు తీసుకోవడం, నచ్చకపోతే యాడ్స్ వద్దనుకోవడం, ఏవైనా సమస్యలు వస్తే యాడ్స్ క్యాన్సిల్ చేసుకొని వాటి డబ్బులు తిరిగిచ్చేయడం సాధారణంగా జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక పాన్‌ మసాల బ్రాండ్‌కు లీగల్‌ నోటీసు పంపారు.

Punam Khaur : ఈటెలను కలిసిన పూనమ్ కౌర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

కొన్ని నెలల క్రితం అమితాబ్ ‘కమలా పసంద్‌’ అనే బ్రాండ్ పాన్‌ మసాలకు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ చేశారు. ఈ యాడ్ అన్ని మీడియాలోనూ టెలిక్యాస్ట్ అయింది. అయితే ఇది కూడా ఒకరకమైన పొగాకు ఉత్పత్తే అని, ఇటువంటి వాటిని ప్రమోట్ చేయొద్దు అని, ప్రజల ప్రాణాలకి హాని కలిగించే ఉత్పత్తులను సెలబ్రిటీస్ ప్రమోట్ చేయొద్దని జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ తెలిపింది. ఇందులో భాగంగానే అమితాబ్ ని ఈ బ్రాండ్ తో ఒప్పందం రద్దు చేసుకొని ఈ యాడ్ ని నిలిపివేసేలా చర్యలు తీసుకోమని కోరింది.

Sankranthi Movies : సంక్రాంతి బిజినెస్ 1000 కోట్లు పైనే..

అమితాబ్‌ దీనికి ఒప్పుకొని కమలా పసంద్ బ్రాండ్‌తో ఒప్పందాన‍్ని రద్దు చేసుకున్నారు. ప్రమోషన్‌ కోసం తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చారు. అయితే కాంట్రాక్ట్‌ రద్దు చేసుకుని, తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చినా తాను నటించిన ప్రకటనలు ఇంకా ప్రసారం చేస్తుండటంతో ఆ కంపెనీకి లీగల్‌ నోటీస్‌ పంపారు అమితాబ్‌. ఈ ప్రకటనల ప్రసారం రద్దు చేయాలని ‘కమలా పసంద్‌’ పాన్‌ మసాల బ్రాండ్‌కు అమితా బచ్చన్‌ న్యాయవాది లీగల్‌ నోటీస్‌ పంపించారు. ఇకపై పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రమోషన్లతో అమితాబ్‌ బచ్చన్‌కు సంబంధం లేదని గత నెలలోనే అమితాబ్‌ బచ్చన్‌ టీం పోస్ట్‌ చేశారు.