Khiladi : డ్యూయల్ రోల్‌లో అనసూయ.. రవితేజకి అత్తగా??

తాజాగా అనసూయ ఓ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తుందని సమాచారం. రవితేజ హీరోగా రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో........

Khiladi : డ్యూయల్ రోల్‌లో అనసూయ.. రవితేజకి అత్తగా??

Anasuya

Anasuya :  బుల్లితెర స్టార్ యాంకర్​ అనసూయ యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్టి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజీ అయింది. ప్రస్తుతం చాలా సినిమాల్లో అనసూయ నటిస్తుంది. ఇటీవల ‘పుష్ప”లో దాక్షాయణిగా అలరించింది. సినిమాల్లో ఎలాంటి పాత్ర వేయడానికి అయినా అనసూయ రెడీగా ఉంది. ఒకపక్క గ్లామరస్ పాత్రలు వేస్తూనే మరో పక్క నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు వేస్తుంది.

తాజాగా అనసూయ ఓ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తుందని సమాచారం. రవితేజ హీరోగా రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటించారు. వీరిలో ఒకరికి అనసూయ తల్లిగా నటిస్తుందట. హీరోయిన్‌కు తల్లిగా మాత్రమే కాకుండా గ్లామర్‌ క్యారెక్టర్ లోను అనసూయ కనపడనుంది.

MS Dhoni : ‘అధర్వ’గా ధోని.. కత్తి పట్టుకొని కొత్త అవతారం..

అంటే ‘ఖిలాడి’ సినిమాలో రవితేజకు అత్త పాత్ర పోషిస్తుంది అనసూయ. ఆమె పోషించిన ఈ పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందని, ఇందులో చాలా బాగా యాక్ట్ చేసిందని ఆ సినిమా యూనిట్ అనుకుంటుంది. రమేశ్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. ‘ఖిలాడి’ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ అయి మంచి స్పందన వస్తుంది. ఖిలాడీ సినిమాని ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.