MS Dhoni : ‘అధర్వ’గా ధోని.. కత్తి పట్టుకొని కొత్త అవతారం..

మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు 'అధర్వ' అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో ధోని అధర్వ అవతారంలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాజు గెటప్ లో కత్తి పట్టుకొని ఉన్న ధోని ఫోటోలు అభిమానులని......

MS Dhoni : ‘అధర్వ’గా ధోని.. కత్తి పట్టుకొని కొత్త అవతారం..

Dhoni

MS Dhoni :  భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచం అంతటా చాలా మంది అభిమానులు ఉన్నారు. మహి క్రికెట్ ఆడితే చూడాలని ఇప్పటికి అందరూ అనుకుంటారు. ఇండియన్ క్రికెట్ కి దూరమైనా ఐపీఎల్ ద్వారా అభిమానులని అలరిస్తున్నాడు. ఇక ధోని క్రికెట్ తో పాటు వేరే గేమ్స్, సాహస కార్యక్రమాలు, బైక్ రైడింగ్స్, యాడ్స్ … లాంటి రకరకాల పనులు చేస్తూ అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. తాజాగా మరో కొత్త అవతారంలో ధోని అభిమానులని పలకరించబోతున్నాడు.

మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ‘అధర్వ’ అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో ధోని అధర్వ అవతారంలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాజు గెటప్ లో కత్తి పట్టుకొని ఉన్న ధోని ఫోటోలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇది చూసిన అభిమానులు ముందు ఇది సినిమానేమో అనుకున్నారు. ధోని హీరోగా మారాడు అనుకున్నారు. కానీ ఇది సినిమా కాదు. వివరాల్లోకి వెళితే.. తమిళ సంగీత దర్శకుడు రమేష్ తమిళ్‌మణి రచిస్తున్న గ్రాఫిక్ నవల ‘అధర్వ: ది ఆరిజిన్’. ఇందులో ధోని హీరో పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇది కేవలం గ్రాఫిక్ నవల మాత్రమే. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

Vishwak Sen : విశ్వక్‌సేన్‌ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్ రిలీజ్

అధర్వ ఒక పీరియాడిక్ గ్రాఫిక్ నవల. ఈ గ్రాఫిక్ నవల త్వరలో అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ప్రీ-ఆర్డర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని కూడా తెలిపారు. విర్జూ స్టూడియోస్, మిడాస్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థల నుంచి ఈ గ్రాఫిక్ నవల రానుంది. తాజాగా ‘అథర్వ – ది ఆరిజిన్’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ధోని పోస్టర్స్ కూడా కొన్ని రిలీజ్ చేశారు. దీని గురించి ధోని మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్‌తో కలిసినందుకు నేను చాలా థ్రిల్‌ అవుతున్నాను. ఇది నిజంగా అద్భుతమైన వెంచర్. ‘అథర్వ – ది ఆరిజిన్’ అనేది ఆకర్షణీయమైన కథ, ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల” అని తెలిపాడు.