Vishwak Sen : విశ్వక్‌సేన్‌ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్ రిలీజ్

యువ హీరో విశ్వక్సేన్ తాజాగా 'అశోక వనంలో అర్జున కళ్యాణం' అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఇవాళ 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. సినిమా టీజర్ తో పాటు......

Vishwak Sen : విశ్వక్‌సేన్‌ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్ రిలీజ్

Vishwaksen

Vishwak Sen :   యువ హీరో విశ్వక్‌సేన్‌ సినిమా సినిమాకి తన క్యారెక్టర్ తో పాటు సినిమా కథల్లోనూ వ్యత్యాసం చూపిస్తున్నాడు. కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పించి అభిమానులని పెంచుకుంటున్నాడు. తాజాగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో రాబోతున్నాడు. రుష్కర్ దిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తుండగా విద్యా సాగర్ తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్ కూడా రిలీజ్ అయి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తాజాగా ఇవాళ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్లో ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. టీజర్ లోనే సినిమా కథని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. టీజర్ ఆద్యంతం కామెడీతో పాటు చివర్లో ఎమోషనల్ గా కూడా చూపించారు.

Venu Tottempudi : రీఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి.. వరుస అవకాశాలు..

సినిమా టీజర్ తో పాటు రిలీజ్ డాట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇప్పటికే సమ్మర్ టార్గెట్ గా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతుండగా చిన్న సినిమాలు కూడా సమ్మర్ బరిలో నిలవడానికి పోటీ పడుతున్నాయి. విశ్వక్‌సేన్‌ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాని మార్చ్ 4న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.