Venu Tottempudi : రీఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి.. వరుస అవకాశాలు..

మళ్ళీ దాదాపు 9 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నారు వేణు తొట్టెంపూడి. ఇప్పటికే రవితేజ హీరోగా చేస్తున్న 'రామారావు ఆన్‌ డ్యూటీ' సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి..........

Venu Tottempudi : రీఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి.. వరుస అవకాశాలు..

Venu

Venu Tottempudi :  ‘స్వయంవరం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు తొట్టెంపూడి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా చిరునవ్వుతో, కల్యాణ రాముడు, చెప్పవే చిరుగాలి, హనుమాన్‌ జంక్షన్‌, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సదా మీ సేవలో.. ఇలా చాలా సినిమాల్లో అలరించారు. వేణు సినిమాల్లో ఎక్కువ శాతం విజయం సాధించినవే. కొన్నాళ్ళకు సినిమాలకి దూరమై చింతకాయల రవి, దమ్ము లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా కూడా చేశాడు.

 

మళ్ళీ దాదాపు 9 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నారు వేణు తొట్టెంపూడి. ఇటీవల చాలా మంది ఒకప్పటి హీరోలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా లేదా విలన్ గా రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఇదే బాటలో వేణు కూడా రీఎంట్రీ ఇస్తున్నారు.

Vijay Devarakonda : మొన్న కస్తూరి.. నిన్న మాళవిక.. సీనియర్ హీరోయిన్స్‌కి తెగ నచ్చేస్తున్న విజయ్ దేవరకొండ

ఇప్పటికే రవితేజ హీరోగా చేస్తున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ధమా​కా’లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయబోతున్నట్టు సమాచారం. వేణు రీఎంట్రీ ఇవ్వడంతో చాలా మంది ఇప్పటికే వేణుని తమ సినిమాల్లో యాక్ట్ చేయమని అడుగుతున్నారట. మళ్ళీ గతంలో లాగా వేణు బిజీ అయి మెప్పిస్తాడని అనుకుంటున్నారు అంతా.