Vijay Devarakonda : మొన్న కస్తూరి.. నిన్న మాళవిక.. సీనియర్ హీరోయిన్స్‌కి తెగ నచ్చేస్తున్న విజయ్ దేవరకొండ

ఇటీవల యువ హీరోయిన్స్‌కి మాత్రమే కాదు సీనియర్ హీరోయిన్స్‌కి కూడా విజయ్ దేవరకొండ తెగ నచ్చేస్తున్నాడు. 'అన్నమయ్య' సినిమాతో తెలుసు ప్రేక్షకులని అలరించిన కస్తూరి.............

Vijay Devarakonda : మొన్న కస్తూరి.. నిన్న మాళవిక.. సీనియర్ హీరోయిన్స్‌కి తెగ నచ్చేస్తున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda (1)

Vijay Devarakonda :   రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్‌గా మారిన విజయ్ తన యాటిట్యూడ్‌తో, తన సేవా కార్యక్రమాలతో, తన బిజినెస్‌లతో జనాలకి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోతున్నాడు. ఇప్పటికే విజయ్‌కి అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా విజయ్‌కి అభిమానులే. ఈ తరం కథానాయికలకు విజయ్ అంటే చాలా ఇష్టం. బాలీవుడ్లో కూడా చాలా మంది యువ హీరోయిన్స్ విజయ్ దేవరకొండతో కలిసి వర్క్ చేయాలని ఉంది, విజయ్ అంటే ఇష్టం అని బహిరంగంగానే చెప్పారు. ఇలా చాలా మంది హీరోయిన్స్ విజయ్ అంటే పడి చచ్చిపోతున్నారు.

ఇటీవల యువ హీరోయిన్స్‌కి మాత్రమే కాదు సీనియర్ హీరోయిన్స్‌కి కూడా విజయ్ దేవరకొండ తెగ నచ్చేస్తున్నాడు. ‘అన్నమయ్య’ సినిమాతో తెలుసు ప్రేక్షకులని అలరించిన కస్తూరి ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం ‘గృహ లక్ష్మి’ సీరియల్ తో అందర్నీ అలరిస్తుంది. అంతే కాక వెబ్ సిరీస్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బిజీ అవుతుంది. గతంలో ‘ఆలీ తో సరదాగా’ షోకి గెస్ట్ గా వచ్చిన కస్తూరి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అని, కలవాలి అనుకుంటున్నాను అని, కలిసి యాక్ట్ చేయాలి అనుకుంటున్నాను అని తెలిపింది.

Son Of India : మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’.. ఫిబ్రవరి 18 థియేటర్లలో..

తాజాగా సీనియర్ హీరోయిన్ మాళవిక కూడా ‘ఆలీ తో సరదాగా’ షోలో గెస్ట్ గా వచ్చింది. మాళవిక కూడా ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పింది. అంతే కాక ఇటీవల టీవీ షోలలో ఇంద్రజ, ఆమని, రోజా లాంటి సీనియర్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ గురించి తెగ పొగిడేశారు. ఇదంతా చూస్తుంటే విజయ్ ఫాలోయింగ్ యూత్ లోనే కాదు సీనియర్స్‌లో కూడా ఓ రేంజ్‌లో ఉందని తెలుస్తుంది. మొత్తానికి విజయ్ యాటిట్యూడ్‌కి, లుక్‌కి, విజయ్ మాటలకి, స్టైల్‌కి సీనియర్ హీరోయిన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.