Son Of India : మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’.. ఫిబ్రవరి 18 థియేటర్లలో..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దాదాపు 7 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ లో సినిమా చేస్తున్నారు. 'సన్ ఆఫ్ ఇండియా' అనే పేరుతో ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు........

Son Of India :  మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’.. ఫిబ్రవరి 18 థియేటర్లలో..

Son Of India (1)

Mohan Babu  :   కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇటీవల కూడా సంక్రాంతికి వద్దామనుకున్న పెద్ద సినిమాలు చాలా వరకు వాయిదా పడ్డాయి. తాజాగా అన్ని సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ని సమ్మర్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఎఫ్ 3, ఆచార్య, భీమ్లా నాయక్, గని, రాధేశ్యామ్, సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ని సమ్మర్ టార్గెట్ చేసి అనౌన్స్ చేశారు. దీంతో మరిన్ని సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయి.

Radheshyam : రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మార్చ్ 11న..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దాదాపు 7 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ లో సినిమా చేస్తున్నారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ సినిమా గ్లింప్స్ ని కూడా గతంలో రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయనున్నారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాని డైమండ్ రత్నబాబు తెరకెక్కించగా, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంస్థల ఆధ్వర్యంలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. దేశభక్తి ఇతని రక్తంలో ఉంది అనే కొటేషన్ తో సినిమా రిలీజ్ డేట్ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు.