Radheshyam : రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మార్చ్ 11న..

పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంతో 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మార్చి 11న రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.....

Radheshyam : రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మార్చ్ 11న..

Radheshyam

Radheshyam :  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో సినిమాని వాయిదా వేశారు. తాజాగా పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. దీంతో సమ్మర్ మొత్తం స్టార్ హీరోల భారీ సినిమాలతో సందడిగా మారనుంది.

Malavika : ‘పుష్ప’ ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే చేస్తా అంటున్న సీనియర్ హీరోయిన్

పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంతో ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మార్చి 11న రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. లవ్ మరియు డెస్టినీకి జరిగే అతి పెద్ద యుద్దానికి సాక్ష్యం అంటూ రాధేశ్యామ్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందిస్తున్నారు. ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా “రాధే శ్యామ్” తెరకెక్కింది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. పాన్ ఇండియాతో పాటు జపనీస్, కొరియా.. లాంటి ఇతర భాషల్లోనూ సినిమాని రిలీజ్ చేయనున్నారు.