Malavika : ‘పుష్ప’ ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే చేస్తా అంటున్న సీనియర్ హీరోయిన్

దాదాపు 12 ఏళ్ల తర్వాత మాళవిక ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మాళవిక 'ఆలీతో సరదాగా షో'లో గెస్ట్ గా పాల్గొంది. ఈ షోలో మాళవిక పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.......

Malavika : ‘పుష్ప’ ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే చేస్తా అంటున్న సీనియర్ హీరోయిన్

Malavika

Malavika :  శ్రీకాంత్, వడ్డే నవీన్ నటించిన ‘చాలా బాగుంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మాళవిక. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో ప్రేక్షకులని అలరించింది. 2009లో తన చివరి సినిమా చేసింది. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మాళవిక ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మాళవిక ‘ఆలీతో సరదాగా షో’లో గెస్ట్ గా పాల్గొంది.

 

ఈ షోలో మాళవిక పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. తాను చేసిన సినిమాల గురించి, తన సినిమాల అనుభవాల గురించి, తాను పడిన సినిమా కష్టాల గురించి ఈ ప్రోమోలో తెలిపింది. త్వరలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. ఇందులో భాగంగా అలీ ఇటీవల ఏం సినిమాలు చూశారు అని అడగగా మాళవిక ‘పుష్ప’ సినిమా చూశానని చెప్పింది.

Hritik Roshan : యంగ్ హీరోయిన్ తో హృతిక్ డేటింగ్?? బాలీవుడ్ లో గుసగుసలు..

అయితే ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ”ఊ అంటావా.. ఊ ఊ అంటావా” సాంగ్ తనకి బాగా నచ్చింది అని, ఆ ఆఫర్ తనకి వచ్చినా చేస్తాను అని చెప్పింది. అక్కడే కూర్చొని ఆ సాంగ్ లోని ఓ స్టెప్ కూడా వేసి చూపించింది. దీంతో అలీ కెమెరా వైపు చూసి బన్నీ పుష్ప పార్ట్ 2లో ఐటెం సాంగ్ ఉంటే చెప్పు మాళవిక చేస్తుంది అని అన్నారు. దీంతో ఈ సాంగ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇక ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు దీన్ని షేర్ చేస్తున్నారు.