Hritik Roshan : యంగ్ హీరోయిన్ తో హృతిక్ డేటింగ్?? బాలీవుడ్ లో గుసగుసలు..

తాజాగా హృతిక్ ఓ యంగ్‌ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మ్యుజిషియన్, యువ నటి సబా ఆజాద్‌ తో హృతిక్ డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరు తరచూ......

Hritik Roshan : యంగ్ హీరోయిన్ తో హృతిక్ డేటింగ్?? బాలీవుడ్ లో గుసగుసలు..

Hrithik Saba Azad

Updated On : February 2, 2022 / 7:16 AM IST

Hritik Roshan :   బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ గతంలో మాజీ భార్య సుశానే ఖాన్‌ తో విడిపోయినట్లు తెలిసిందే. తాజాగా హృతిక్ ఓ యంగ్‌ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మ్యుజిషియన్, యువ నటి సబా ఆజాద్‌ తో హృతిక్ డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరు తరచూ కలుసుకోవడం, సన్నిహితంగా మెలగడం, ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లడంతో హృతిక్‌, సబాల మధ్య రిలేషన్ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది.

ఇటీవల ముంబైలో వీరిద్దరూ డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఇందులో హృతిక్‌ ఆమె చేయి పట్టుకుని బయటకు వస్తూ కనిపించాడు. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా హృతిక్‌, సబాలు కలిశారట. అప్పటి నుంచి వీరిద్దరూ క్లోజ్‌గా ఉంటున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. సబా నటితో పాటు ఓ ఇండి మ్యూజిషియన్‌, తనకి ఓ బ్యాండ్‌ కూడా ఉంది. వీరిద్దరి పరిచయం తర్వాత హృతిక్‌ తన మ్యూజిక్‌ను బాగా ఇష్టపడుతున్నాడట. ఈ క్రమంలోనే సబాను తరచూ కలుస్తున్నాడని, వీరిద్దరూ కలిసి వర్క్‌ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Chiranjeevi : అభిమాని కూతురి పెళ్ళికి మెగాస్టార్ సాయం..

ఈ డిన్నర్ డేట్ కి వెళ్లడంతో మీడియా కంట పడ్డారు. రెస్టారెంట్ నుంచి బయటకి వచ్చేటప్పుడు ఇద్దరూ చేతులు పట్టుకొని రావడంతో, హృతిక్ కార్ డోర్ తీసి సబాని ఎక్కమనడం ఇవన్నీ చూసి బాలీవుడ్ మీడియా వీరిద్దరి మధ్య కచ్చితంగా డేటింగ్ నడుస్తుందని అంటుంది. మరి వీరు దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

View this post on Instagram

A post shared by yogen shah (@yogenshah_s)