Anchor Suma : అలాంటి వాళ్లలో మా ఆయన ఒకరు..

సుమ భర్త రాజీవ్ కనకాల కూడా వెండితెరపై విలన్ రోల్స్ లోను, సపోర్టింగ్ రోల్స్ లోను చేస్తూ మెప్పిస్తున్నాడు. అయితే ఇటీవల రాజీవ్ కి పేరు తెచ్చే పాత్ర ఒక్కటి కూడా రాలేదు.

Anchor Suma : అలాంటి వాళ్లలో మా ఆయన ఒకరు..

Rajeev

Anchor Suma :  తన మాటలతో బుల్లితెరని ఏలుతుంది యాంకర్ సుమ. ఇంకో వైపు సినిమా ఈవెంట్స్ ని కూడా అదరగొడుతుంది. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా వెండితెరపై విలన్ రోల్స్ లోను, సపోర్టింగ్ రోల్స్ లోను చేస్తూ మెప్పిస్తున్నాడు. అయితే ఇటీవల రాజీవ్ కి పేరు తెచ్చే పాత్ర ఒక్కటి కూడా రాలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత లవ్ స్టోరీ సినిమాలో ప్రతినాయక పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ పాత్రకి మరింత గుర్తింపు వచ్చింది.

తాజాగా యాంకర్ సుమ లవ్ స్టోరీ సినిమాను చూసి తన భర్త నటనపై సోషల్ మీడియాలో ప్రశంశలు కురిపించింది. సోషల్ మీడియాలో సుమ తన భర్త రాజీవ్ ని ఉద్దేశించి.. ‘తమ నటనతో మనల్ని మెప్పించగల నటులు కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో నా హబ్బీ రాజీవ్ కనకాల కూడా ఒకరు. అద్బుతమైన రోల్ పోషించినందుకు కంగ్రాట్స్. ఆ పాత్ర చేసినందుకు నువ్వెంత చెడుగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు.. కానీ ఆ పాత్రతో ఎంతో మంది మీద ప్రభావాన్ని చూపించావ్ అని అన్నారు.

Heroines : ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ వీళ్లే

అలాగే చిత్ర యూనిట్ గురించి.. అలాంటి సున్నితమైన అంశాలను, మరింత సున్నితంగా చూపించిన శేఖర్ కమ్ములకు థ్యాంక్స్. నాగ చైతన్యకు హార్టీ కంగ్రాట్స్. సాయి పల్లవి డ్యాన్స్ చూసి నా కళ్లు నొప్పి పుట్టేశాయి. కళ్లు ఆర్పకుండా తన డ్యాన్స్ ని అలాగే చూస్తూ ఉండిపోయాను. లవ్ స్టోరీ టీం మొత్తానికి కంగ్రాట్స్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సుమ.