Heroines : ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ వీళ్లే
అందంగా కనిపించడానికి సినిమా హీరోయిన్స్ కొంతమంది సర్జరీలు చేయిస్తుంటారు. ఎక్కువగా చాలా మంది హీరోయిన్స్ పెదాలకు, ముక్కుకి సర్జరీలు చేయిస్తారు. పెదాలు బాగుంటే నవ్వు బాగుంటుందని నవ్వు
Heroines : అందంగా కనిపించడానికి సినిమా హీరోయిన్స్ కొంతమంది సర్జరీలు చేయిస్తుంటారు. ఎక్కువగా చాలా మంది హీరోయిన్స్ పెదాలకు, ముక్కుకి సర్జరీలు చేయిస్తారు. పెదాలు బాగుంటే నవ్వు బాగుంటుందని నవ్వు బాగుంటే ఆటోమేటిక్ గా ముఖం కూడా అందంగా కనపడుతుందని నమ్ముతారు. ఇదివరకు ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ఈ కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమల హీరోయిన్స్ ఈ సర్జరీల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వీరిలో చాలామంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. కానీ కొంతమందికి ఈ సర్జరీలు వికటించాయి కూడా.
ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌లో చాలా చేంజ్ వచ్చింది. ఆమె లుక్ పై సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ చేశారు. దీనికి కారణం రకుల్ పెదవులకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని, అది తేడా కొట్టడంతో రకుల్ ముఖంలో అంత చేంజ్ వచ్చిందని సమాచారం. రకుల్ పాత ఫొటోలు ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే మీకే ఆ తేడా అర్ధమవుతుంది.
అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన ముక్కుకి నోస్ జాబ్ అనే కాస్మెటిక్ సర్జరీని చేయించుకుని మరింత అందంగా మారింది. అందుకే శ్రీదేవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కంటే కూడా తర్వాతే బాగుంటుంది. తెలుగు స్టార్ హీరోయిన్ సమంత కూడా తన ముక్కు, పెదాలకు సర్జరీ చేయించుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా తర్వాత సమంత ఈ సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం. సమంత ఇప్పటికంటే కూడా మొదట్లోనే ఇంకా క్యూట్ గా ఉండేదని అభిమానులు అనుకుంటారు.
ఇంకో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అందాన్ని పెంచుకునేందుకు తన ముఖానికి మైనర్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. ఇందుకోసం అమెరికాలో డాక్టర్లను సంప్రదించింది. ఇక సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా అందానికి మెరుగులు దిద్దుకుంది. రాజా రాణి సినిమా వరకు కొంచెం బొద్దుగా ఉన్న నయనతార ఆపరేషన్ తోనే కొవ్వు కరిగించుకుని స్లిమ్ గా మారింది.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష కూడా తన పై-పెదవికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది అని గాసిప్స్ కూడా వచ్చాయి.
శృతి హాసన్ తన ముక్కుకు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించానని తనే స్వయంగా తెలిపింది. శృతిహాసన్ 2009లో లక్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. అందుకే తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది తెలిపింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ కూడా మల్లన్న సినిమాకు ముందు తన పెదాలకు సర్జరీ చేయించుకుంది. పై పెదవి విల్లులా కనిపించేలా శ్రియ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది.
అమ్మ నాన్న ఓ తెలుగమ్మాయి సినిమాలో అమాయకంగా కనిపించే ఆసిన్ కూడా బాలీవుడ్ కి వెళ్ళాక తన పెదవులకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. జోష్ సినిమాతో పరిచయమైన ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక కూడా తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. జోష్ సినిమా తర్వాత తన అందంపై కొంతమంది విమర్శలు చేశారని తన ముక్కుకి కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది.
బాలీవుడ్ లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచి సినిమాల్లోకి వచ్చిన ప్రియాంక చోప్రా కూడా తన ముక్కుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. విరాట్ వైఫ్ అనుష్క శర్మ కూడా తన పెదవులకి సర్జరీ చేపించుకుంది. శిల్పా శెట్టి కూడా తన ముక్కు ఆకారాన్ని మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా సినిమాల్లోకి వచ్చే ముందు పెదాలకు సర్జరీ చేయించుకుంది. అందుకే తను సినిమాల్లోకి రాకముందు కంటే కూడా వచ్చాకే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక సూపర్ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఆయేషా టాకియా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. కానీ వికటించటంతో తన ఫేస్ లో చాలా మార్పులు వచ్చాయి.