MAA Elections : సభ్యత్వం ఎవరైనా తీసుకోవచ్చు.. అధ్యక్షుడు మాత్రం తెలుగువాడే ఉండాలి.. ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు

తెలుగు సినీ పరిశ్రమ, కళాకారుల సంక్షేమంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న మీరు ఉన్నట్టుండి 'మా' ఎన్నికల్లో పోటీ చేసి అందర్నీ కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మాటలకు, మ్యానిఫెస్టోకు తేడా ఉంటుంది.

MAA Elections :  సభ్యత్వం ఎవరైనా తీసుకోవచ్చు.. అధ్యక్షుడు మాత్రం తెలుగువాడే ఉండాలి.. ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు

Maa

MAA Elections :  సినీ ‘మా’ ఎలక్షన్స్ రోజు రోజుకి జనరల్ ఎలక్షన్స్ ని మించిపోతున్నాయి.ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఇవాళ మంచు విష్ణు ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో సీనియర్ నటుడు నరేష్ తన ప్రత్యర్థి ప్యానెల్ పై, ‘మా’ అధ్యక్ష్య పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి.. మీరు ఎప్పుడైనా ఓటు వేయడానికి వచ్చారా? వార్షిక సమావేశాలకు హాజరయ్యారా? ‘మా’ లో ఉన్న ఏ సభ్యుడికైనా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారా? మీరు ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు ఆ విషయం మీకు గుర్తుందా? ‘మా’ ఎన్నికల కోసం మీరు వచ్చారా? లేక మిమ్మల్ని ఎవరైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు.

ప్రకాశ్ రాజ్‌ గారు మీరు ఎవరికైనా సహాయం చేశారా?? ఓ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడ ఏమైనా చేశారా?? కానీ నేను అనంతపురం జిల్లాను దత్తత తీసుకొని అక్కడ 60 మండలాల కళాకారులకు సేవ చేస్తున్నాను. అనేక మంది కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇప్పించాను. పిల్లలకు చదువు చెప్పిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.

Cinema : విలన్లు గా మారుతున్న హీరోలు..

తెలుగు సినీ పరిశ్రమ, కళాకారుల సంక్షేమంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న మీరు ఉన్నట్టుండి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి అందర్నీ కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మాటలకు, మ్యానిఫెస్టోకు తేడా ఉంటుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో ఉన్న సభ్యులకే ఆయన గెలుస్తాడా లేదో అని సందేహంగా ఉంది అని మీడియాతో తెలిపారు. అంతే కాక నేను ప్రకాష్ రాజ్ ని నాన్ లోకల్ అనను కానీ ‘మా’ సంఘం తెలుగు వాళ్ళది కాబట్టి అధ్యక్షుడిగా తెలుగు వాళ్ళే ఉండాలి. సభ్యత్వం మాత్రం ఎవరైనా తీసుకోవచ్చు అని నరేష్ వ్యాఖ్యానించారు.