Cinema : విలన్లు గా మారుతున్న హీరోలు..

సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోలు ఎవ్వరూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలని అంత తొందరగా ఒప్పుకునే వారు కాదు. విలన్ వేషాలు అయితే అస్సలు వేసే వాళ్ళు కాదు. హీరో అంటే హీరో క్యారెక్టర్ మాత్రమే

Cinema : విలన్లు గా మారుతున్న హీరోలు..

Hero

Cinema :  సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోలు ఎవ్వరూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలని అంత తొందరగా ఒప్పుకునే వారు కాదు. విలన్ వేషాలు అయితే అస్సలు వేసే వాళ్ళు కాదు. హీరో అంటే హీరో క్యారెక్టర్ మాత్రమే చేస్తాము అని ఉండేవాళ్ళు. చిరంజీవి, మోహన్ బాబు, గోపీచంద్ ఇలా విలన్స్ గా వచ్చి హీరోలు అయినా వాళ్ళు ఉన్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ లా కెరీర్ అయిపోతుంది అనుకునే సమయంలో విలన్లుగా మారిన వాళ్ళు ఉన్నారు. కానీ హీరోగా కెరీర్ నడుస్తున్నప్పుడే విలన్ గా వచ్చినా చేస్తున్నారు నేటి తరం హీరోలు.

సినిమాలో హీరోకి ఎంత పాత్ర ఉంటుందో విలన్ కి కూడా అంతే ఉంటుంది. విలన్ ని ఎంత బెటర్ గా చూపిస్తే హీరో అంత ఎలివేట్ అవుతాడు. విలన్ గా నటనకి కూడా మంచి స్కోప్ ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో యంగ్ హీరోలు విలన్ ఆఫర్స్ వచ్చినా వద్దనకుండా చేస్తున్నారు.

BalaKrishna : బాలకృష్ణ రెండు సినిమాలు ఓటిటిలో..

ఇప్పటికే రానా ‘బాహుబలి’ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. మళ్ళీ విలన్ గా చేయబోతున్నాడు కూడా. హీరో కార్తికేయ ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ గా చేసాడు. త్వరలో అజిత్ నటిస్తున్న ‘వలిమై’ సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నాడు. ఇప్పటికే హీరో నాని ‘వి’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాడు. ఇప్పుడు తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీయబోయే సినిమాలో నాని విలన్ గా చేయబోతున్నట్టు సమాచారం. హీరో ఆది పినిశెట్టి కూడా ‘సరైనోడు’ సినిమాలో విలన్ గా చేసాడు. మరికొన్ని సినిమాల్లో కూడా చేయబోతున్నాడు. హీరో నాగ చైతన్య కూడా ఒక వెబ్ సిరీస్ లో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు. వీళ్ళే కాకుండా ఇప్పుడు వచ్చే నవీన్ చంద్ర, సత్యదేవ్, తిరువీర్ లాంటి మరికొంతమంది యువ నటులు కూడా అటు హీరో ఇటు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.

అంతేకాక కన్నడ స్టార్ హీరో సుదీప్ మన తెలుగు ‘ఈగ’ సినిమాలో విలన్ గా నటించాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తమిళ్ హీరో ఆది కూడా తమిళ్ తెలుగులో విలన్ ఆఫర్స్ వస్తుంటే వద్దనకుండా చేస్తున్నాడు. ఇది ఇండస్ట్రీకి మంచి పరిణామమే అని చెప్పొచ్చు.