BalaKrishna : బాలకృష్ణ రెండు సినిమాలు ఓటిటిలో..

నందమూరి బాలకృష్ణ ఆయన నటించిన రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను శ్రేయాస్ ఏటీటీ

BalaKrishna : బాలకృష్ణ రెండు సినిమాలు ఓటిటిలో..

Nbk

BalaKrishna :  యువరత్న నందమూరి బాలకృష్ణ ఆయన నటించిన రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను శ్రేయాస్ ఏటీటీ ద్వారా గతేడాది దసరా సందర్భంగా విడుదల చేసారు. అయితే ఇది కేవలం 17 నిమిషాల ఫుటేజ్‌ మాత్రమే. షూటింగ్ అయినంతవరకే ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏటిటిలోనే దాదాపు ఒక కోటి 25 లక్షల కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఈ డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు బాలకృష్ణ.

ఇలా ఎక్కడో మరుగునపడిన ‘నర్తనశాల’ సినిమాను ఇపుడు బయటకు తీసి ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు రిలీజ్ చేయడం మంచి విషయమే. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వటంతో గతంలో రిలీజ్ అవ్వని ఆగిపోయిన రెండు సినిమాలని మళ్ళీ ఇప్పుడు ఇలాగే ఓటిటి లేదా ఏటిటి ద్వారా రిలీజ్ చేయాలని చూస్తున్నారు బాలకృష్ణ.

Pawan Kalyan : సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ ఒంటరి అవుతున్నారా..?

అందులో ఒకటి కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమసింహ భూపతి’ సినిమా. బాలకృష్ణ , కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. దాదాపు 80 శాతం వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ ఈ చిత్ర నిర్మాత చనిపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా రష్ ని బయటకి తీసి ఎంతవరకు ఎడిట్ అయితే అంతవరకు చేసి విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ.

ఇంకోటి సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తర్వాత హిందీలో కూడా ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో మళ్లీ రీమేక్ చేశారు. తెలుగు వర్షన్ రిలీజ్ అయినా హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని వదిలేశారు. ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించాడు. ఇప్పుడు ఈ సినిమాని కూడా బాలకృష్ణ ఓటిటి కానీ ఏటిటిలో కానీ రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు.

BiggBoss 5 : బిగ్ బాస్ లోకి విష్ణుప్రియ… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ??

ఆగిపోయిన నర్తనశాల సినిమాని రిలీజ్ చేసి దానికి మంచి స్పందన పొందడంతో ఇలా ఆగిపోయిన ఇంకో రెండు సినిమాలను కూడా రిలీజ్ చేయాలనీ బాలయ్య బాబు చూస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇదే కనక జరిగితే ఇలా ఆగిపోయిన చాలా సినిమాలు రిలీజ్ బాట పట్టి ఎంతో కొంత క్యాష్ చేసుకుంటాయి. ఆ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.