Vaibhav Sooryavanshi : ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ వచ్చినా వైభవ్ సూర్యవంశీ అసంతృప్తి.. లక్ష్యం చాలా పెద్దదే భయ్యా.. రెండు కాదు ఏకంగా 5 కు గురి..
ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).
Vaibhav Sooryavanshi big promise to RR in IPL 2 nahi 3 or 4 or 5
- ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ వచ్చినా వైభవ్ సూర్యవంశీకి నిరాశే
- ఆర్ఆర్కు కప్పును అందించలేకపోయానని బాధ
- తన లక్ష్యం ఏంటో చాలా స్పష్టంగా చెప్పిన 15 ఏళ్ల బుడ్డోడు
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. జస్ప్రీత్ బుమ్రా, హేజిల్‌వుడ్, కగిసో రబాడ వంటి హేమాహేమీ బౌలర్లును సైతం ఎలాంటి భయం లేకుండా అలవోకగా ఎదుర్కొన్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఇంటర్వ్యూలో సూర్యవంశీ మాట్లాడుతూ.. తనపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్న ఫ్యాన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తృటిలో ఫైనల్ చేరుకోలేకపోయింది. క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. దీనిపై వైభవ్ మాట్లాడుతూ.. జట్టును ఫైనల్‌కు చేర్చి, ఆర్ఆర్కు రెండో ఐపీఎట్ టైటిల్‌ను అందించలేకపోయినందుకు తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను నెరవేర్చలేకపోయానని భావోద్వేగానికి గురి అయ్యాడు.
అభిమానులు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జట్టును విజేతగా నిలుపుతానని నమ్మారు. దురదృష్టవశాత్తూ అది సాధ్యపడలేదు. కానీ.. రాజస్థాన్ రాయల్స్ జట్టును మళ్లీ ఛాంపియన్‌గా చూసే రోజు చాలా త్వరలోనే వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అని సూర్యవంశీ తెలిపాడు.
A honest, wholesome conversation with IPL’s MVP, Vaibhav Sooryavanshi 💝 pic.twitter.com/8jgFmWsKtw
— Rajasthan Royals (@rajasthanroyals) June 7, 2026
రాజస్థాన్ రాయల్స్ అభిమానులు రెండో ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, అయితే తాను కేవలం ఒక్క ట్రోఫీతోనే ఆగిపోవాలని అనుకోవడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. రాబోయే కాలంలో ఫ్రాంచైజీ కోసం వరుసగా మూడు, నాలుగు, ఐదు ట్రోఫీలను గెలవడమే తన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశాడు. అభిమానుల మద్దతు, ఆశీస్సులు ఇలాగే కొనసాగితే.. జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి తామంతా సాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చాడు.
అభిమానులు చూపించిన ఆదరణను చూసి తాను ముగ్ధుడనయ్యానని చెప్పాడు. తాను ఔట్ అయినప్పుడు తల్లులు బాధపడటం, తండ్రులు తన ఇన్నింగ్స్‌ను ఆస్వాదించడం, కుటుంబాలు మొత్తం తన ఆట కోసం ఎదురుచూడటం చూసి తనకు మాటలు రావడం లేదని, రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సూర్యవంశీ అని భావోద్వేగానికి లోనైయ్యాడు.
