BiggBoss 5 : బిగ్ బాస్ లోకి విష్ణుప్రియ… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ??

ప్రతి సారి బిగ్ బాస్ మధ్యలో ఎవరో ఒకర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ తో కలిసి గేమ్ ఆడతారు.

BiggBoss 5 : బిగ్ బాస్ లోకి విష్ణుప్రియ… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ??

Vishnu

BiggBoss 5 :

ఈ సీజన్ బిగ్ బాస్ షో రోజు రోజుకి చాలా ఆసక్తికరంగా మారుతుంది. చిన్న చిన్న గేమ్స్ తో మొదలై పెద్ద పెద్ద టాస్కులు ఆ టాస్కుల్లో కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలతో, ఒకరి పై ఒకరు కంప్లైట్స్ తో ఈ షో సాగుతుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ప్రతి సారి బిగ్ బాస్ మధ్యలో ఎవరో ఒకర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ తో కలిసి గేమ్ ఆడతారు.

తాజాగా ఇప్పుడు వస్తున్న వార్తల సమాచారం ప్రకారం త్వరలో బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని సమాచారం. అయితే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక లేడీ యాంకర్‌ను తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ లేడీ యాంకర్ ఎవరో కాదు విష్ణుప్రియ అని సమాచారం. కరోనా ముందు విష్ణు ప్రియ యాంకర్ గా షోస్ చేస్తూ వేరే ప్రోగ్రామ్స్ లో కూడా కనిపించేది. కానీ కరోనా తర్వాత తనకి యాంకరింగ్ ఛాన్సులు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లో కనిపిస్తోంది. దీంతో తనకి మళ్ళీ ఫేమ్ రావాలంటే బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ఫిక్స్ అయిందంట విష్ణుప్రియ.

Posani Krishna Murali : పోసాని ఇంటిపై రాళ్ళ దాడి.. ఇది వాళ్ళ పనే??

కానీ ఇదివరకు తనకు బిగ్‌బాస్‌ కాన్సెప్టే నచ్చదని చెప్పింది. మరి ఈ సీజన్ లో ఆల్రెడీ పిలుపు వచ్చిందని సమాచారం. ఇందుకోసం మంచి అమౌంట్ నే ఆఫర్ చేశారని టీవీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఈ సారి వైల్డ్ కార్డు ఎంట్రీ విష్ణు ప్రియ ఇస్తుందా లేక ఇంకెవరినైనా తీసుకొస్తారా అని.