Elon Musk: ప్రపంచ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్.. ఆ ఆస్తి విలువ తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం
ఎలాన్ మస్క్(Elon Musk) త్వరలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (లక్ష కోట్ల డాలర్ల అధిపతి) కాబోతున్నారని తాజా అంచనాలు చెబుతున్నాయి.
elon musk to become worlds first trillionaire net worth details
- ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డు.
- మొదటి ట్రిలియనీర్గా ఎదిగే అవకాశం.
- దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ.
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ త్వరలోనే చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ వ్యక్తికీ సాధ్యం కాని రీతిలో, ఆయన త్వరలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ (లక్ష కోట్ల డాలర్ల అధిపతి) కాబోతున్నారని తాజా అంచనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారుగా రూ. 9,49,50,500 కోట్లు కావడం గమనార్హం. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల ఐపీఓ మార్కెట్ విలువ పెరగడం ద్వారా ఆయన ఈ రికార్డుకు చేరువవుతున్నారు.
Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగ తేదీలు ఖరారు.. స్వర్ణాల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు.
మస్క్ సంపాదన ఏ స్థాయిలో ఉందంటే.. ఆయన సంపద ప్రపంచంలోని అనేక బలమైన దేశాల ఆర్థిక వ్యవస్థల (GDP) కంటే పెద్దది కానుంది. తైవాన్ ($977 బిలియన్లు), ఐర్లాండ్ ($779 బిలియన్లు), స్వీడన్ ($760 బిలియన్లు), సింగపూర్ ($660 బిలియన్లు) వంటి దేశాల వార్షిక ఆర్థిక ఉత్పత్తి కూడా మస్క్(Elon Musk) కాబోయే ట్రిలియన్ డాలర్ల ఆస్తి కంటే తక్కువగానే ఉండటం విశేషం. గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన మన్హట్టన్ ఆర్థిక వ్యవస్థ కంటే కూడా ఇది పెద్దది.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, టెక్ ప్రపంచంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలైన జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల మొత్తం సంపదను కలిపినా మస్క్ ఆస్తి కంటే స్వల్పంగా మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అలాగే అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని మొత్తం ఆస్తుల విలువ కంటే కూడా మస్క్ సంపద ఎక్కువే. చివరగా ప్రపంచంలోని టాప్ 50 అత్యంత విలువైన స్పోర్ట్స్ టీమ్లను అన్నింటినీ కొనుగోలు చేసినా ఆయన వద్ద ఇంకా భారీగానే డబ్బు మిగిలిపోతుంది.
