Syamala : యాకర్ శ్యామల కొత్త ఇల్లు చూశారా??.. ఎంత బాగుందో..

శ్యామల కొన్ని రోజుల క్రితం భారీగా ఓ కొత్త ఇల్లు కట్టుకుంది. తాజాగా శ్యామల తన కొత్త ఇంటిని వీడియో తీసి హోమ్ టూర్ గా పోస్ట్ చేసింది. ఈ హోమ్ టూర్ వీడియోలో................

Syamala : యాకర్ శ్యామల కొత్త ఇల్లు చూశారా??.. ఎంత బాగుందో..

Syamala Home Tour

Syamala :  ఇటివల సెలబ్రిటీలంతా తమ ఇళ్ళని చూపిస్తూ హోమ్ టూర్ పేరుతో వీడియోల్ని చేస్తున్నారు. ఆ వీడియోల్ని తమ యూట్యూబ్ ఛానల్ లో పెట్టి అభిమానులకి, ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నారు. తాజాగా మరో నటి, యాంకర్ కూడా తన కొత్తింటిని హోమ్ టూర్ చేసి వీడియో పోస్ట్ చేసింది. నటిగా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన శ్యామల యాంకర్ గా ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఇంటర్వ్యూలు, సినీ ఫంక్షన్స్ తో బిజీ బిజీగా ఉండే శ్యామల కొన్ని రోజుల క్రితం భారీగా ఓ కొత్త ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు గృహ ప్రవేశం కూడా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టింది.

Syamala

 

ఇప్పుడు తాజాగా శ్యామల తన కొత్త ఇంటిని వీడియో తీసి హోమ్ టూర్ గా పోస్ట్ చేసింది. ఈ హోమ్ టూర్ వీడియోలో.. ముందు తన ఇంటిని బయట నుంచి చూపించింది. పల్లె వాతావారణం నుంచి వచ్చాను, అందుకే ఖాళీగా ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా ఇంటి ముందు అరుగులా ఉండేలా మెట్లు నిర్మించుకున్నాను అని ఇంటి బయట మొత్తం చూపించింది. తర్వాత దేవున్ని ఎక్కువగా నమ్ముతానంటూ పూజగది చూపించింది.

Nithya Menen : సినిమాలకి బ్రేక్ ఇస్తున్నాను.. పెళ్లిపై నిత్యామీనన్ క్లారిటీ..

ఇక వరుసగా విశాలమైన కిచెన్‌, అక్కడే ఉన్న డైనింగ్‌ టేబుల్‌, ఇంట్లో ఉన్న రెండు హాల్స్‌, నాలుగు బెడ్‌రూమ్స్‌, తన కొడుకు ఇషాన్‌ ప్రత్యేక బెడ్‌రూమ్‌, అటాచ్‌డ్‌ బాల్కనీ, ఇంట్లో ఉన్న లిఫ్ట్‌, ఓపెన్‌ వార్డ్‌ రోబ్‌, రీడింగ్‌ ప్లేస్‌, మాస్టర్‌ బెడ్‌రూమ్‌, ఇంటిపైన పెట్టించిన సోలార్‌ ప్యానెల్‌ను చూపింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఇల్లు చాలా బాగుందని, పెద్ద ఇల్లు అని కామెంట్స్ చేస్తున్నారు.