NTR 30: కొరటాల కోసం యాంగ్రీమెన్.. ఎన్టీఆర్ బాబాయ్ ఫిక్స్?

‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడడంతో కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిన జక్కన్న అండ్ కో ఇప్పుడిప్పుడే అందులో నుండి బయటపడుతుంది.

NTR 30: కొరటాల కోసం యాంగ్రీమెన్.. ఎన్టీఆర్ బాబాయ్ ఫిక్స్?

Ntr 30

NTR 30: ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడడంతో కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిన జక్కన్న అండ్ కో ఇప్పుడిప్పుడే అందులో నుండి బయటపడుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. దీంతో ఈ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు కొరటాల. గతంలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

DJ Tillu: వైరస్ ఎఫెక్ట్.. డీజే టిల్లు విడుదల వాయిదా!

అప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేసే సినిమా.. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేసే సినిమా కావడంతో ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, కియారా అద్వానీ హీరోయిన్లుగా పరిశీలిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

Hero Trailer: ‘హీరో’ తొలి సినిమా కష్టాలకు తోడైన ప్రేమ!

ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ గా ఓ ఇంపార్టెంట్ పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్ర కోసం మరో స్టార్ హీరోను తీసుకోవాలని కొరటాల అనుకుంటుండగా ఈ పాత్ర కోసం హీరో రాజశేఖర్ ను ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుండగా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.