All of Us Are Dead: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న మరో కొరియన్ సిరీస్!

కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనేలా మాదిరిపోయింది ప్రజల ఎంటర్ టైన్మెంట్ సెగ్మెంట్. అంతకు ముందు ఇండియా లాంటి..

All of Us Are Dead: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న మరో కొరియన్ సిరీస్!

All Of Us Are Dead

All of Us Are Dead: కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనేలా మాదిరిపోయింది ప్రజల ఎంటర్ టైన్మెంట్ సెగ్మెంట్. అంతకు ముందు ఇండియా లాంటి దేశాలలో ఇన్ని వేల థియేటర్లు ఉండగా ఓటీటీలో ఎవడు చూస్తారు అనేలా అభిరపాయముంటే కరోనా తర్వాత ఓటీటీలకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరెట్లు ఓటీటీలు బలపడిపోయాయి. ఓటీటీల మధ్య కూడా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొనడంతో ప్రేక్షకులకు బెస్ట్ వినోదం దక్కుతుంది.

NTR30: లీడర్ గా తారక్.. పొలిటికల్ స్పెషల్ గా కొరటాల సినిమా?

కాగా.. ఓటీటీలో ఇక్కడ అక్కడా అని లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి మంచి కంటెంట్ ఉన్నా ప్రపంచంలోని అన్ని మూలాల నుండి మంచి ఆదరణ దక్కుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది ఓ కొరియన్ సిరీర్ దుమ్ములేపిన సంగతి తెలిసిందే. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ చరిత్రలో కొత్త రికార్డులను క్రియేట్ చేయగా దీనికి డబ్ చేసి దాదాపు అన్ని బాషలలో కూడా రిలీజ్ చేస్తే అంతే ఆదరణ దక్కించుకుంది.

Serial Actress: అర్ధరాత్రి తప్పతాగి సీరియల్ నటీనటుల రచ్చ.. అరెస్ట్!

ఇప్పుడు అదే నెట్ ఫ్లిక్స్ లో మరో వెబ్ సిరీర్ దుమ్మురేపుతోంది. ఆ సిరీస్ పేరే ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్’. డిఫరెంట్ జాంబీ టైప్ థ్రిల్లర్ డ్రామాగా కనిపించే ఈ సిరీస్ మళ్ళీ నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ అన్ని దేశాల్లో పెద్ద ఎత్తున వ్యూస్ సాధిస్తుంది. ఈ సిరీస్ గ్లోబల్ గా ట్రెండింగ్ నెంబర్ 1లో నిలిచి మరో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మొత్తం 12 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ మరోసారి నెట్ ఫ్లిక్స్ ను ట్రెండింగ్ లోకి తెచ్చింది.