NTR30: లీడర్ గా తారక్.. పొలిటికల్ స్పెషల్ గా కొరటాల సినిమా?

మూడేళ్ళ సినిమా కెరీర్ ను ఆర్ఆర్ఆర్ కోసం వదిలేసుకున్న తారక్ ఇప్పుడు గ్యాప్ ను వరస సినిమాలతో ఫుల్ ఫిల్ చేసేందుకు సిద్దమయ్యాడు

NTR30: లీడర్ గా తారక్.. పొలిటికల్ స్పెషల్ గా కొరటాల సినిమా?

#ntr30

NTR30: మూడేళ్ళ సినిమా కెరీర్ ను ఆర్ఆర్ఆర్ కోసం వదిలేసుకున్న తారక్ ఇప్పుడు గ్యాప్ ను వరస సినిమాలతో ఫుల్ ఫిల్ చేసేందుకు సిద్దమయ్యాడు. దీని కోసం వరసగా సినిమాలను పట్టాలెక్కించేందుకు సిద్దమైన తారక్ ముందుగా కొరటాల శివ సినిమా చేయనున్నాడు. అతి త్వరలోనే మొదలు కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవగా త్వరలోనే ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

Radhe Shyam: రాధేశ్యామ్ పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఇదే?

గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అందునా ఆర్ఆర్ఆర్ తర్వాత రాబోయే ఎన్టీఆర్ సినిమా కావడం.. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుండడం తారక్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ కూడా సిద్ధం కాగా ఇది పొలిటికల్ టచ్ ఉన్న సినిమాగా సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

Rahul Sankrityan : ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో??

రాజకీయ నాయకులకు విద్యార్థులకు మధ్య జరిగే కథలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. పొలిటికల్ పార్టీలలో విద్యార్థి విభాగాలు.. దాని వెనక రాజకీయ పార్టీల కోణాన్ని ఈ తరానికి తగ్గట్లుగా మలిచారని వినిపిస్తుంది. గతంలో తారక్ నాగ సినిమాలో విద్యార్థి నాయకుడిగా కనిపించగా ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ప్రచారం ప్రకారం ఎన్టీఆర్ అభిమానులకు ఖుషీ చేస్తుంది.