Ante Sundaraniki: అంటే.. సుందరానికి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు...

Ante Sundaraniki: అంటే.. సుందరానికి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Ante Sundaraniki First Week Collections

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Ante Sundaraniki: మిలియన్ మార్క్‌కు చేరువలో సుందరం.. దీంతో ఏడు!

ఇక ఈ సినిమా రిలీజ్ రోజునే ప్రేక్షకుల్లో మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లినా, ఆ తరువాత కలెక్షన్ల పరంగా ఢీలా పడింది. దీంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Ante Sundaraniki: మండే టెస్టులో సుందరం ఫెయిల్..?

కాగా.. ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.18.39 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. అటు గ్రాస్ పరంగా ఈ సినిమా రూ.32.60 కోట్లు వసూలు చేసి నాని కెరీర్‌లో మంచి హిట్ సినిమాగా నిలిచిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలవగా, ఈ సినిమా రెండో వారంలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి. కాగా.. ఏరియాల వారీగా ఈ చిత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5.58 కోట్లు
సీడెడ్ – 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.33 కోట్లు
ఈస్ట్ – 0.93 కోట్లు
వెస్ట్ – 0.79 కోట్లు
గుంటూరు – 0.87 కోట్లు
కృష్ణా – 0.84 కోట్లు
నెల్లూరు – 0.58 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 12.05 కోట్లు(రూ.20.40 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 1.34 కోట్లు
ఓవర్సీస్ – 5 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.18.39 కోట్లు(రూ.32.60 కోట్లు గ్రాస్)