Ante Sundaraniki: మండే టెస్టులో సుందరం ఫెయిల్..?

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ’’ గత శుక్రవారం మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్....

Ante Sundaraniki: మండే టెస్టులో సుందరం ఫెయిల్..?

Ante Sundaraniki 4 Days Worldwide Collections

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ’’ గత శుక్రవారం మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందర అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు సరికొత్తగా అనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు.

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. తొలిరోజు ఎంత కొల్లగొట్టాడంటే?

అయితే రిలీజ్ రోజున ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందా అని అందరూ అనుకున్నారు. కానీ.. తొలి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమాకు అసలు పరీక్ష సోమవారం నాడు ఎదురైంది. ఈ సినిమాకు ఎంతో కీలకమైన మండే టెస్ట్‌లో సుందరం ఫెయిల్ అయ్యాడని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Ante Sundaraniki: అంటే సుందరానికీ… ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

తొలి మూడు రోజుల్లో ‘అంటే సుందరానికీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.14.95 కోట్ల షేర్ వసూళ్లు సాధించగా, నాలుగు రోజుల్లో ఈ అంకె కేవలం రూ.16.11 కోట్లుగా మాత్రమే నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా నాలుగో రోజైన సోమవారం నాడు కేవలం రూ.0.71కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇలా సోమవారం నాడు అంటే సుందరానికీ చిత్ర కలెక్షన్స్ ఈ స్థాయిలో డ్రాప్ అవ్వడంతో, ఈ వారంలో ఈ సినిమా ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారంలో మరో రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అంటే సుందరానికీ చిత్రానికి గడ్డుకాలం తప్పదని మూవీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమా నాలుగు రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.94 కోట్లు
సీడెడ్ – 1.11 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.25 కోట్లు
ఈస్ట్ – 0.89 కోట్లు
వెస్ట్ – 0.76 కోట్లు
గుంటూరు – 0.83 కోట్లు
కృష్ణా – 0.78 కోట్లు
నెల్లూరు – 0.55 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.11.11 కోట్లు (రూ.18.80 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.20 కోట్లు
ఓవర్సీస్ – 3.80 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.16.11 కోట్లు (రూ.28.35 కోట్లు గ్రాస్)