Ante Sundaraniki: అంటే సుందరానికీ.. తొలిరోజు ఎంత కొల్లగొట్టాడంటే?

నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్‌లు జంటగా నటించిన ‘‘అంటే సుందరానికీ’’ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా జూన్ 10న....

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. తొలిరోజు ఎంత కొల్లగొట్టాడంటే?
ad

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్‌లు జంటగా నటించిన ‘‘అంటే సుందరానికీ’’ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక వీకెండ్‌లో ఈ సినిమాకు రెస్పాన్స్ పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Ante Sundaraniki: అంటే సుందరానికీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

నాని తనదైన కామెడీతో ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లిన విధానం సూపర్బ్. ఇక నజ్రియాతో నాని చేసిన కామెడీ, రొమాన్స్ ఈ సినిమాకు మరో మేజర్ అసెట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల దగ్గర్నండి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నాని క్రేజ్ సినిమా కలెక్షన్స్‌కు బాగా ఉపయోగపడింది.

Ante Sundaraniki: అంటే సుందరానికీ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు

తొలిరోజు ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.5.82 కోట్ల షేర్ వసూళ్లు వచ్చినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.56 కోట్లు
సీడెడ్ – 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.44 కోట్లు
ఈస్ట్ – 0.34 కోట్లు
వెస్ట్ – 0.34 కోట్లు
గుంటూరు – 0.34 కోట్లు
కృష్ణా – 0.28 కోట్లు
నెల్లూరు – 0.19 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.3.87 కోట్లు (రూ.6.50 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.70 కోట్లు
ఓవర్సీస్ – 1.70 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.5.82 కోట్లు (రూ.10 కోట్లు గ్రాస్)