Ante Sundaraniki: అంటే సుందరానికీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ రేపు(జూన్ 10) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. ఈ సినిమాతో నాని తన సక్సెస్....

Ante Sundaraniki: అంటే సుందరానికీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

Ante Sundaraniki Worldwide Pre Release Business Details

Updated On : June 9, 2022 / 1:39 PM IST

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ రేపు(జూన్ 10) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. ఈ సినిమాతో నాని తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తున్న అంటే సుందరానికీ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Ante Sundaraniki: అంటే సుందరానికీ పవర్ ఇస్తోన్న పవన్!

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా సాలిడ్‌గానే జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాని సినిమాలకు ఉండే క్రేజ్ కారణంగా ‘అంటే.. సుందరానికీ’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో నాని పాత్ర హిలేరియస్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అంతేగాక, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా వస్తుండటం కూడా బయ్యర్లు ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసేలా చేసింది.

Ante Sundaraniki: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న సుందరం

నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే మార్క్ ఉండటం కూడా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌కు హెల్ప్ అయ్యిందని చెప్పాలి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎంతమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా.. అంటే సుందరానికీ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 10 కోట్లు
సీడెడ్ – 2.7 కోట్లు
వైజాగ్ – 2.4 కోట్లు
ఈస్ట్ – 1.6 కోట్లు
వెస్ట్ – 1.4 కోట్లు
కృష్ణా – 1.5 కోట్లు
గుంటూరు – 1.8 కోట్లు
నెల్లూరు – 0.8 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 22.2 కోట్లు
కర్ణాటక – 1.8 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.0 కోట్లు
ఓవర్సీస్ – 3.0 కోట్లు
P&P – 2.0 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ – రూ.30 కోట్లు