Ante Sundaraniki: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న సుందరం

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం రిలీజ్ అవుతున్న మూవీ ‘అంటే సుందరానికీ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని....

Ante Sundaraniki: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న సుందరం

Ante Sundaraniki Locks Ott Partner

Ante Sundaraniki: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం రిలీజ్ అవుతున్న మూవీ ‘అంటే సుందరానికీ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, అందాల భామ నజ్రియా నాజిమ్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ వరకు అన్నీ కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

Ante Sundaraniki: అంటే.. సుందరానికీ అలా కుదిరింది!

అయితే ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఈ చిత్రంలో ఉంటాయని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో నాని, నజ్రియాల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ను కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Ante Sundaraniki: అంటే.. సుందరానికీ.. సెన్సార్ బోర్డు అలా ఇచ్చేశారు!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ‘అంటే సుందరానికీ’ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నాని సినిమాలకు ఉండే క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ చిత్రాన్ని భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సినిమా రిలీజ్ తరువాత వచ్చే రిజల్ట్‌ను బట్టి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వీడియో భావిస్తోంది. మరి సుందరం ఓటీటీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి అంటున్నారు నాని అభిమానులు.