Ante Sundaraniki: అంటే.. సుందరానికీ అలా కుదిరింది!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా.....

Ante Sundaraniki: అంటే.. సుందరానికీ అలా కుదిరింది!

Ante Sundaraniki Pre Release Event Details

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికీ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో మలయాళ భామ నజ్రియా నాజిమ్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో, ఈ కాంబినేషన్‌పై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Ante Sundaraniki: అంటే.. సుందరానికీ.. సెన్సార్ బోర్డు అలా ఇచ్చేశారు!

ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసింది. తాజాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వారు వెల్లడించారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన అంటే సుందరానికీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూన్ 8న హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. పక్కా కామెడీ గురూ!

దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎవరెవరు వస్తారా.. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారా.. అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.