Ante Sundaraniki: అంటే సుందరానికీ.. పక్కా కామెడీ గురూ!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ..’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ....

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. పక్కా కామెడీ గురూ!

Ante Sundaraniki Teaser Released

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ..’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. కాగా ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాలో నాని-నజ్రియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Nani: అంటే సుందరానికీ.. తెలుగులోనే కాదు!

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఆద్యంతం పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమా నవ్వులు పూయించడం ఖాయమని ప్రేక్షకులు అంటున్నారు. ఈ టీజర్‌లో నాని ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, నజ్రియా ఓ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతిగా మనకు కనిపిస్తారు. తమతమ సంప్రదాయాలకు విలువనిచ్చే రెండు కుటుంబాల మధ్య నాని-నజ్రియా లవ్‌స్టోరి ఎలాంటి పరిణామాలను తీసుకొచ్చిందా అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమువుతోంది.

Nani: పంచకట్టుతో రంగంలోకి దూకిన సుందరం మాస్టారు!

నాని ఈ సినిమాలో ఎక్కువగా పంచెకట్టులోనే మనకు కనిపించబోతున్నాడు. ఫారిన్‌కు వెళ్లినా కూడా పంచెకట్టును వదలని నాని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది మనకు ఈ సినిమాలో చాలా ఫన్నీగా చూపించబోతున్నారు చిత్ర యూనిట్. మొత్తానికి అంటే సుందరానికీ ఓ పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యిందనే విషయం ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిస్తుండగా, వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 10న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి అంటే సుందరానికీ మూవీ ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.