Samsung Galaxy Z Fold 7 : అదిరిపోయే ఆఫర్.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై రూ. 19వేలు తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Samsung Galaxy Z Fold 7 : గత ఏడాది జూలైలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 లాంచ్ చేసింది. ఇప్పుడు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Samsung Galaxy Z Fold 7 : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 భారీ తగ్గింపుతో లభిస్తోంది. గత ఏడాది జూలైలో ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయింది. భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే. ఫ్లిప్‌కార్ట్‌లో ధర డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో భారీ తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 5జీ డిస్కౌంట్లు, ఆఫర్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,59,990గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 2025లో రూ. 1,74,999 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 4వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. తద్వారా శాంసంగ్ ఫోన్ ధర రూ. 1,55,990 అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 19,009 తక్కువకే లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7లో 1856x2160 పిక్సెల్స్ రిజల్యూషన్, 2,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 8-అంగుళాల QXGA+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్ప్లే ఉంది. 1080x2520 పిక్సెల్స్ రిజల్యూషన్, 21:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ కవర్ డిస్ప్లేతో వస్తుంది.

ఈ ఫోన్లో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 4,400mAh బ్యాటరీ ఆప్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్1.7 అపర్చర్‌తో 200MP ప్రైమరీ కెమెరా, ఎఫ్2.2 అపర్చర్‌తో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్2.4 అపర్చర్‌తో 10MP 3ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఎఫ్2.2 అపర్చర్‌తో 10MP ప్రైమరీ కెమెరా, ఎఫ్2.2 అపర్చర్‌తో 10MP సెకండరీ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ ఉన్నాయి.
