Nani: అంటే సుందరానికీ.. తెలుగులోనే కాదు!

నేచురల్ స్టార్ నాని రీసెంట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’లో తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను ఒంటిచేత్తో విజయపు తీరాలకు చేర్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌తో నాని ప్రస్తుతం...

Nani: అంటే సుందరానికీ.. తెలుగులోనే కాదు!

Nani Ante Sundaraniki Movie Gives Interesting Update

Nani: నేచురల్ స్టార్ నాని రీసెంట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’లో తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను ఒంటిచేత్తో విజయపు తీరాలకు చేర్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌తో నాని ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీలను తెరకెక్కిస్తూ బిజీగా మారాడు. ‘అంటే సుందరానికీ’ అనే సినిమాను ఇప్పటికే లైన్‌లో పెట్టాడు ఈ హీరో. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ ఆత్రయే పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ante Sundaraniki: పంచకట్టుతో సందడి చేసిన అంటే సుందరానికీ టీమ్!

ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసమే కాకుండా దక్షిణాదిన ఇతర భాషల్లోని ప్రేక్షకుల కోసం కూడా చిత్ర యూనిట్ రెడీ చేస్తున్నట్లు తెలిపింది.

Nani: గోదావరిఖనిలో ‘దసరా’ చేసుకుంటున్న నాని!

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది రేపు(ఏప్రిల్ 18) ఉదయం 11.07 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.