Nani: గోదావరిఖనిలో ‘దసరా’ చేసుకుంటున్న నాని!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే...

Nani: గోదావరిఖనిలో ‘దసరా’ చేసుకుంటున్న నాని!

Nani Dasara Song Shooting In Godavarikhani

Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీ ‘దసరా’ను పట్టాలెక్కిస్తున్నాడు ఈ స్టార్ హీరో. నాని తొలిసారిగా పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడుతూ నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణలోని సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Dasara: ఊరమాస్ నానీ.. కెవ్వు కేక ‘స్పార్క్ ఆఫ్ దసరా’ గ్లిమ్ప్స్!

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను గోదావరిఖనిలో నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా హీరో నాని, అందాల భామ కీర్తి సురేష్‌ల మధ్య ఓ సాంగ్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో ఏకంగా 500 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ పాటను కంపోజ్ చేస్తుండటంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరికొత్త గెటప్‌లో మనకు కనిపించనున్నాడు. మాస్ యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉండబోతున్న ఈ సినిమా, నాని కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.