Pawan Kalyan: అక్కడ కటౌట్లు పెట్టుకుని నటుడు సీఎం అయ్యారు, ఇక్కడ నన్ను 15ఏళ్లు రోడ్లమీద దేకిచ్చారు- పవన్ కల్యాణ్
ఒక పార్టీని నడపటం అంటే లక్షల మంది సమూహాన్ని ఏకతాటిపై నడిపించడం. అది చాలా కష్టమైన పని.
Pawan Kalyan: తమిళనాడు రాజకీయాలు, విజయ్ సీఎం కావడం అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయని పవన్ అన్నారు. తనకు అసూయ కలిగేంత చక్కగా తమిళనాడు పాలిటిక్స్ సాగాయన్నారు. తమిళనాడులో కటౌట్లు పెట్టుకుంటే నటుడు సీఎం అయ్యారని కామెంట్ చేశారు పవన్ కల్యాణ్. కానీ, ఏపీలో తనను 15ఏళ్లు రోడ్ల మీద దేకిచ్చారని కామెంట్ చేశారు.
”తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా. వాళ్లు ఎంత సుఖంగా చేశారు పాలిటిక్స్. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. అక్కడ కటౌట్లు పెట్టుకుని గెలిచేశారు. నటుడు సీఎం అయిపోయారు. ఇక్కడ, నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చారు. రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. మానవత్వం గురించి ఆలోచించాను. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన ఉండాలి. ఒక రాజకీయ పార్టీని నడపటం అంత సులువు కాదు. ఒక పార్టీని నడపటం అంటే లక్షల మంది సమూహాన్ని ఏకతాటిపై నడిపించడం. చాలా కష్టమైన పని. మన ఇంట్లో కుటుంబసభ్యులమే ఏకతాటిపై ఉండము. అలాంటిది నేను ఎంత సాహసం చేశాను అంటే.. బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో మార్చేద్దామని ఒక పిచ్చి. అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది” అని రాజమండ్రిలో జనసేన నాయకులతో మీటింగ్ లో పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: వైసీపీ నాయకులు జైలుకెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? వాడుకుంది చాలు.. ఇక ఆపేయండి- పవన్ కల్యాణ్ ఫైర్
