Padma Awards 2026: తెలుగు పద్మాలు.. పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగువారు వీరే..
అవార్డ్ గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.
Padma Awards 2026: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను ప్రదానం చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మంది పద్మ అవార్డులు దక్కాయి. వారిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు. మొదటి విడతలో 66 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ వైద్యుడు వెంకట్రావుకు, క్యాన్సర్ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డ్ దక్కింది. అవార్డ్ గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
President Droupadi Murmu presents Padma Shri in the field of Art to Smt. Deepika Reddy. Smt. Deepika Reddy is an accomplished performer, an ingenious choreographer, a dedicated Guru and a cultural ambassador. She is recognized as a leading exponent of the Kuchipudi art form. Her… pic.twitter.com/uSesBSIRRj
— President of India (@rashtrapatibhvn) May 25, 2026
