Aadhaar Free Update Deadline : ఆధార్ వినియోగదారులకు అలర్ట్.. ఆ గడువు పెంపు.. ఇకపై ఆ యాప్ పని చేయదు..!
Aadhaar Free Update Deadline : ఆధార్ కార్డు వినియోగదారులకు కీలక అలర్ట్.. ఆ యాప్ ఇకపై పని చేయదు.
UIDAI extends free Aadhaar document update till June 2027 And announce mAadhaar app set to retire soon
Aadhaar Free Update Deadline : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక కీలక ప్రకటన చేసింది. మైఆధార్ (myAadhaar) పోర్టల్ ద్వారా ఉచితంగా ఆన్లైన్ లో ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకునే గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు అంటే.. 2027 జూన్ 14 వరకు ఈ గడువును పొడిగించినట్లు తెలిపింది. దీనివల్ల ఆధార్ కార్డుదారులు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా తమ గుర్తింపు పత్రాలు (Proof of Identity), అడ్రెస్ ప్రూఫ్ (Proof of Address) పత్రాలను అప్డేట్ చేసుకునేందుకు మరో సంవత్సరం గడువు లభిస్తుంది.
వాస్తవానికి అయితే గతంలో ప్రకటించిన మేరకు ఈ ఉచిత అప్డేట్ సేవల సౌకర్యం 2026 జూన్‌తో ముగియాల్సి ఉంది. కానీ తాజాగా దీన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉచిత అప్డేట్ సదుపాయం మైఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని UIDAI ఒక ప్రకటనలో తెలిపింది.
ఆన్లైన్లో ఆధార్ డాక్యుమెంట్లను ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..
ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మైఆధార్ పోర్టల్ కి వెళ్లి ఈ కింద పేర్కొన్న దశల వారీగా తమ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు:
- మైఆధార్ (myAadhaar) పోర్టల్‌ను సందర్శించాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి.
- అప్పుడు మీ మొబైల్ కి వచ్చే OTP సహాయంతో లాగిన్ అవ్వాలి.
- ప్రొఫైల్ విభాగంలో స్క్రీన్ మీద కనిపించే మీ గుర్తింపు, చిరునామా వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలి.
- ఒకవేళ ఆ వివరాలు సరైనవే అయితే, ఆ సమాచారాన్ని ధృవీకరించి ముందుకు సాగాలి.
- డ్రాప్-డౌన్ మెనూ నుండి మీ వద్ద ఉన్న గుర్తింపు పత్రాల వివరాలను ఎంచుకుని.. వాటిని JPEG, PNG లేదా PDF ఫార్మాట్లో (2 MB కంటే తక్కువ సైజులో) అప్లోడ్ చేయాలి.
- అదేవిధంగా, అడ్రెస్ ప్రూఫ్ (Proof of Address) ని కూడా నిర్ణీత ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- అలాగే భవిష్యత్తులో స్టేటస్ ట్రాక్ చేసుకోవడం కోసం అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ను భద్రపరుచుకోవాలి.
వీటికి ప్రత్యక్ష ధృవీకరణ తప్పనిసరి
ఆధార్‌కు సంబంధించిన కొన్ని మార్పులను ఆన్లైన్లో పూర్తి చేయడం కుదరదు. అందుకోసం కచ్చితంగా సదరు వ్యక్తి ఆధార్ నమోదు కేంద్రానికే వెళ్లాలి.
- బయోమెట్రిక్ వివరాలు: వేలిముద్రలు, కంటి పాప (ఐరిస్ స్కాన్లు), ఫోటోగ్రాఫ్‌ల వంటి వివరాలను మార్చుకోవడానికి నేరుగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.
- వ్యక్తిగత వివరాలు: పేరు, లింగం (Gender), మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలలో మార్పులు చేయాలన్నా కూడా ఆధార్ సెంటర్ లో ప్రత్యక్షంగా ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది.
ఇకపై ఆ యాప్ పని చేయదు
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న ‘mAadhaar’ యాప్ త్వరలోనే నిలిపివేయబడుతుందని అధారిటీ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా UIDAI స్పందిస్తూ.. వినియోగదారులు కొత్త ఆధార్ యాప్‌కు మారాలని సూచించింది. ఈ కొత్త యాప్‌లో సురక్షితమైన QR కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలతో పాటు ఆధార్ సేవలను సులభంగా యాక్సెస్ చేసుకునే మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
