Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

గత సంవత్సరం దసరా రోజు నాని 'దసరా' సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. ఈ సారి.......

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

Nani :  న్యాచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. ఇప్పటికే నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘అంటే.. సుందరానికీ!’ సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం గ్యాప్ తీసుకుంటున్న నాని త్వరలో ‘దసరా’ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.

 

గత సంవత్సరం దసరా రోజు నాని ‘దసరా’ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. ఈ సారి నాని మరింత పూర్తి మాస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. శ్రీకాంత్‌ ఓదెల అనే కొత్త దర్శకుడు సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Bigg Boss Swetaa Varma : మొన్న లహరి.. నిన్న శ్వేతా.. బైక్స్ కొంటున్న బిగ్‌బాస్ భామలు

అయితే ‘దసరా’ సినిమా కోసం ఏకంగా 12 కోట్ల బడ్జెట్‌తో పల్లె వాతావరణం సెట్‌ని రూపొందిస్తున్నారట. ఇటీవల వచ్చిన నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా కోసం ఐదెకరాల్లో కోల్‌కత్తా సెట్‌ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌ కొల్ల ‘దసరా’ కోసం విలేజ్‌ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో దాదాపు 12 ఎకరాల్లో గ్రామీణ నేపథ్యం కనపడేలా ఈ సెట్ ని వేస్తున్నారు. ఈ సెట్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత దసరా షూటింగ్ మొదలవ్వనుంది.