Ante Sundaraniki: పంచకట్టుతో సందడి చేసిన అంటే సుందరానికీ టీమ్!

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తోనే ఆడియెన్స్ దృష్టిని తనవైపు తిప్పుకున్న.....

Ante Sundaraniki: పంచకట్టుతో సందడి చేసిన అంటే సుందరానికీ టీమ్!

Ante Sundaraniki Team Panchekattu Party

Ante Sundaraniki: నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తోనే ఆడియెన్స్ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ సినిమాలో నాని సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ, ‘అంటే సుందరానికీ’ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెబుతున్నాడు.

Ante Sundaraniki: అంటే సుందరానికి నుండి ప్రేయర్ ఆఫ్ లీలా.. ఇంట్రో అదిరింది!

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, ప్రోమోలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాగా, తాజాగా ఈ సినిమా నుండి తొలి సింగిల్ సాంగ్ ‘పంచకట్టు’ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హసిత్ గోలి అద్భుతమైన లిరిక్స్ అందించగా.. అరుణా సాయిరామ్ ఈ పాటను ఆలపించారు. ఇక వివేక్ సాగర్ సంగీతం ఈ పాటకు మరో మేజర్ హైలైట్‌గా నిలవడంతో, ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే చార్ట్‌బస్టర్‌గా మారిపోయింది. క్యాచీ ట్యూన్స్, రిఫ్రెషింగ్ లిరిక్స్‌తో ఈ పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండటంతో యూట్యూబ్‌లో ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

ఈ పాట హిట్ కావడంతో సినిమా టీమ్, సక్సెస్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ సెలెబ్రేషన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పంచకట్టులో హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సినిమాలోని పంచకట్టు పాటలో నాని పంచకట్టుతో కనిపించి మెప్పించగా, ఇప్పుడు ఈ పాట సక్సెస్ వేడుకలో ఇలా టీమ్ మెంబర్స్ అందరూ కూడా పంచకట్టులో కనిపించడంతో ఈ సినిమాపై జనాల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

Ante Sundaraniki: నాని సినిమాకి ఏడు రిలీజ్ డేట్స్.. పెద్ద చిక్కే!

మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్‌గా ఈ సినిమాతో తెలుగునాట ఎంట్రీ ఇస్తుండగా, ఈ చిత్రాన్ని జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే జూన్ 10 వరకు ఆగాల్సిందే.